Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?

తెలుగు సినీ ఇండస్ట్రీ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభం గుండా వెళ్తోంది. ఒకప్పుడు చిన్న సినిమా అయినా రిలీజ్ అంటే చాలు సింగిల్ స్క్రీన్లు హౌస్ఫుల్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్లకు ఆడియన్స్ రావడం లేదా, ఆర్థిక ఇబ్బందులు, అన్నీ కలిసి సింగిల్ స్క్రీన్లను మూతపడేలా చేస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం స్టార్ హీరోలేనా? లేక వేరే సమస్యలా? అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. సినీ విశ్లేషకులు మాత్రం స్టార్ హీరోల తీరే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

Tollywood Crisis: Star Heroes Impact

గతంలో స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ చేసేవారు. దాంతో ఆడియన్స్ కి థియేటర్లకి వెళ్లే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు స్టార్ హీరోలు ఒక్కో సినిమాకి మూడు, నాలుగు సంవత్సరలు టైమ్ తీసుకుంటున్నారు. షూటింగ్ ఆలస్యం, రీషూట్స్, VFX పని… ఇలా సినిమా పూర్తవ్వడానికి చాలా టైమ్ పడుతోంది. దీంతో థియేటర్లలో కంటెంట్ కరవు ఏర్పడింది. ఏటా రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు నెలకి నాలుగైదు సినిమాలు ఆడే సింగిల్ స్క్రీన్లలో ఇప్పుడు ఏడాదికి ఒక్కటి కూడా రిలీజ్ అవ్వడం లేదు.

నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెబుతున్నారు. స్టార్ హీరోలు ఒకేసారి పెద్ద బడ్జెట్ సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. దాంతో మల్టీప్లెక్స్ల్లోనే ఎక్కువ షోలు వేస్తున్నారు. సింగిల్ స్క్రీన్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అలాగే OTT ప్లాట్ఫారమ్ల రాకడతో సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ కూడా ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు సింగిల్ స్క్రీన్లలో మంచి వసూళ్లు రాబడుతున్నా, పెద్ద సినిమాల కోసం ఆడియన్స్ మల్టీప్లెక్స్లకే వెళ్తున్నారు. ఈ పరిస్థితులన్నీ కలిసి సింగిల్ స్క్రీన్లకు మింగుడు పడడం లేదు. ఫలితంగా చాలా చోట్ల థియేటర్లు మూతపడుతున్నాయి. ఇండస్ట్రీ లోని అందరూ కలిసి ఆలోచిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని అంటున్నారు.

మరోవైపు, స్టార్ హీరోలు మాత్రం తమది తప్పు కాదని, పెద్ద సినిమాలకు తీసుకునే టైమ్ సహజమేనని అంటున్నారు. ప్రేక్షకుల అభిరుచి మారిపోయిందని, కథ కంటే సినిమా ప్యాకేజింగ్ ఎక్కువ ముఖ్యమైందని వారి వాదన. అయితే నిపుణులు మాత్రం ఇది సరైన సమర్థన కాదంటున్నారు. స్టార్ హీరోలు సంవత్సరానికి కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ చేస్తే థియేటర్ల పరిస్థితి అలా ఉండేది కాదని చెబుతున్నారు. ఒకవేళ ఈ పరిస్థితి కొనసాగితే, రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో చాలా సింగిల్ స్క్రీన్లు శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉంది. దీనివల్ల పెద్ద సినిమాలు మరింతగా మల్టీప్లెక్స్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది.

https://x.com/pakkafilmy007/status/1600352362639822848

Share your love