Kaantha: ఇద్దరు హీరోల మధ్య చిచ్చు పెట్టిన “కాంత”.. షూటింగ్ లో కొట్టుకునేవరకు వెళ్లి.!

Kaantha who caused a rift between the two heroes

Kaantha: ఏంటి కాంత సినిమా ఇద్దరు హీరోల మధ్య చిచ్చు.. పెట్టిందా..నిజంగానే హీరోలు ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్లారా.. ఇంతకీ ఆ హీరో ఏం చెప్పారు అనేది ఇప్పుడు చూద్దాం.. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్లో వస్తున్న కాంత మూవీలో దుల్కర్ సల్మాన్ హీరోగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా.. దగ్గుబాటి రానా ఓ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాకి దుల్కర్,రానా ఇద్దరు నిర్మాతలుగా కూడా చేస్తున్నారు. అలా ఈ సినిమా మరికొద్ది గంటల్లో అంటే నవంబర్ 14న మన ముందుకు రాబోతుంది.

Kaantha who caused a rift between the two heroes

ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ చేస్తూ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే ఈ సినిమా గురించి రీసెంట్గా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో హీరో దుల్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంత సినిమా వల్ల రానాకి నాకు మధ్య గొడవ కూడా జరిగింది అంటూ చెప్పుకొచ్చారు.మరి ఆ గొడవ ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. దుల్కర్ కాంత మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ..కాంత మూవీ ఎప్పుడో ఎనిమిది సంవత్సరాల క్రితమే నా దగ్గరికి వచ్చింది. ఎనిమిది సంవత్సరాల క్రితం స్టార్ట్ అవ్వాల్సిన ఈ సినిమా చాలా సమయం పట్టింది. (Kaantha)

Also Read: Kaantha: ఆ హీరో రియల్ స్టోరీనే “కాంత” లో చూపించబోతున్నారా.?

ఆ తర్వాత లక్కీ భాస్కర్, కాంత రెండు సినిమాలను ఒకేసారి చేద్దాం అనుకున్నా. కానీ కుదరలేదు.కాంత మూవీ కంటే ముందే లక్కీ భాస్కర్ రిలీజ్ అయింది. దాంతో నాకు కాంత సినిమాపై అసహనం మొదలైంది. ఆ తర్వాత ఈ సినిమా గురించి నాకు రానాకి చిన్నపాటి కూడా జరిగింది. దానికి కారణం ఒక నిర్మాతగా సినిమా లేట్ అవ్వడం,డేట్స్ గురించి ఆవేదన ఉంటుంది.ఈ కారణంగానే నాకు రానాకి మధ్య గొడవ జరిగింది. అయితే ఈ సినిమాకి మెయిన్ ఇష్యూ ఏంటంటే.. ఇద్దరు స్టార్స్ బిజీ షెడ్యూల్.ఇందులో నేను రానా ఇద్దరం కీ రోల్స్ పోషించాం.

Kaantha who caused a rift between the two heroes

ఇద్దరం వేరే వేరే సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల డేట్స్ ఇష్యు కూడా సినిమా లేటవడానికి ప్రధాన కారణం. ఇక చివరికి సినిమా తెరకెక్కదు అని ఒకానొ సమయంలో సినిమాని వదిలేద్దాం అనుకున్నా. కానీ ఎందుకో సినిమాని వదిలేయ బుద్ధి కాలేదు. ఎందుకంటే ఈ సినిమాలోని పాత్రకి నేను చాలా కనెక్ట్ అయిపోయాను. అంతే కాదు ఒక మంచి సినిమా తెరకెక్కాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అని కాంత సినిమా పూర్తయ్యాక నాకు అర్థమైంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరో దుల్కర్ సల్మాన్. అలా కాంత మూవీ వల్ల రానా,దుల్కర్ మధ్య కొన్ని గొడవలు కూడా వచ్చాయట.ఫైనల్ గా ఆ గొడవలు సమసిపోయి ఇద్దరు సినిమాని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు.(Kaantha)

Share your love