“ఖుషి” డైరెక్టర్ తో రవితేజ మూవీ

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య మజిలీ అనే హిట్ సినిమా చేశారు. ఈ కాంబోలో మరో కొత్త చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయంటా టాక్ వినిపించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఈ సినిమాని క్యాన్సిల్ అయ్యిందని టాక్. చాన్నాళ్లుగా ఈ కథ పై శివ నిర్వాణ కసరత్తు చేశాడు. స్టోరీ లైన్ తో మెప్పించిన శివ నిర్వాణ ఫుల్ స్టోరీతో మెప్పించలేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీంతో శివ నిర్వాణ రవితేజను అప్రోచ్ అయి కథ చెప్పారట. ఈ కథ ఓకే కావడంతో వీళ్ల కాంబోలో మూవీ సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం నాగ చైతన్య కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేస్తుండగా, రవితేజ మాస్ జాతర సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Share your love