Blue Aadhar Card Do You Know About These Aspects

Blue Aadhar Card Do You Know About These Aspects

Blue Aadhar Card ప్రస్తుతం మన దేశంలో మనం ఎక్కడికి వెళ్లినా మనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉండాలి. ఐడెంటిటీ కోసమే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఈ ఆధార్ కార్డు ద్వారానే ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పథకాలు అయినా సబ్సిడీలు అయినా మనకు అందిస్తున్నారు.

ఎలాంటి చిన్న పనులకైనా ఆధార్ కార్డు తప్పనిసరిగా అడుగుతున్నారు. మనకు ఫస్ట్ గుర్తింపు కార్డు ఏంటయ్యా అంటే అది ఆధార్ కార్డు అని చెప్పవచ్చు. 12 అంకెలతో ప్రత్యేకంగా యుఐడిఏఐ జారీ చేస్తోంది. అయితే ఇప్పటివరకు మనకు వైట్ కలర్ లో ఆధార్ కార్డు మాత్రమే చూశాం. బ్లూ ఆధార్ కార్డు అంటే చాలామందికి తెలియదు..ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Also Read : Amazon Sale : 14 వేలకే ల్యాప్ టాప్.. గ్రేట్ ఫీచర్స్..!

కేంద్ర సర్కార్ ఐదు సంవత్సరాల లోపు ఉండే పిల్లలకు బాల్ ఆధార్ కార్డ్ అని పిలిచే ఒక బ్లూ ఆధార్ కార్డును 2018 సంవత్సరంలో తీసుకువచ్చింది. ఈ ఆధార్ కార్డులో కూడా 12 అంకెలే ఉంటాయి. అయితే ఐదు సంవత్సరాలు లోపు పిల్లలకు మాత్రమే ఇది చెల్లుబాటు అవుతుంది.అయితే సాధారణంగా పెద్దవారీ ఆధార్ కార్డులో వారి యొక్క రెటీనా వివరాలు వేలిముద్రలు అన్ని ఆన్లైన్లో సెట్ చేసి పెడతారు. కానీ బ్లూ ఆధార్
కార్డులో ఇవేవీ ఉండవు. కేవలం ఆ చిన్నారి యొక్క పేరు వివరాలు మాత్రమే పెడుతారు.అయితే అట్టి చిన్నారి ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత వారి యొక్క రెటీనా వివరాలు, వేలిముద్రలు యుఐడిఏఐకి అందించాలి.

ఈ బ్లూ ఆధార్ కార్డు కావాలంటే ఆధార్ సెంటర్ కు చిన్నారి యొక్క డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ తో పాటు మీ యొక్క ఇతర వివరాల పత్రాలు పట్టుకొని అక్కడికి వెళ్లి వారి వారిచ్చే ఫామ్ నింపి, పూర్తి వివరాలు ఆధార్ సెంటర్ లో తెలియజేయాలి. ఈ క్రమంలో చిన్నారి యొక్క ఫోటోను ఆధార్ సెంటర్ లో వారు తీసుకొని ఆ ఫోటోను వారికిచ్చే బ్లూ ఆధార్ కార్డుపై ప్రింట్ చేస్తారు. అంతేకాకుండా మీరు పని చేసే మొబైల్ నెంబర్ ను వారికి అందించాలి. ఆధార్ కార్డు ప్రతి వివరాలు దానికి మెసేజ్ రూపంలో వస్తాయి. అలా ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 60 రోజులలోపు బాల్ ఆధార్ కార్డు మనకు వస్తుంది.

Click Here to Follow PakkaFilmy in Google News

Join WhatsApp