Good News for Samsung Fans - New Smartphone Launch

Good News for Samsung Fans – New Smartphone Launch

Samsung ప్రస్తుతం టెక్ దిగ్గజ కంపెనీలు రోజుకొక స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేస్తూ.. ఇతర సంస్థలతో పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆపిల్ యొక్క తాజా మరియు ప్రీమియం మోడల్ ఐఫోన్ 15 ప్రో మాక్స్ తో సహా అన్ని ఐఫోన్లోని కెమెరాలను పోటీలో అధిగమించడానికి ఇప్పుడు శాంసంగ్ నిర్ణయాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

200 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతో అద్భుతమైన సెన్సార్లు 100 ఎక్స్ జూమ్ తో పెరిస్కోప్ లెన్స్ వంటి ఫీచర్లతో కూడిన అత్యాధునిక కెమెరా స్మార్ట్ ఫోన్ ను తాజాగా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. మరి ఆ స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ త్వరలోనే విడుదల చేయబోతోంది. ఇక ఈ ఫోను ఐఫోన్ 15 ప్రో మాక్స్ కు సమాధానంగా తయారు చేయబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ఉన్న కెమెరాలు గురించి తాజాగా లీక్ అవ్వడం జరిగింది.

Also Read : Jio Phone : జియో కస్టమర్లకు శుభవార్త.. సరికొత్త ఫోన్ లాంచ్..!

శాంసంగ్ ఎస్ 24 అల్ట్రాక్వాడ్ రియల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. 1/1.3 మరియు ప్రైమ్, సెన్సార్ పరిమాణం తో 200 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా ను కలిగి ఉంటుంది. 12 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరాని కూడా కలిగి ఉంటుంది అలాగే 10 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా 3x ఆప్టికల్ జూమ్ ని కూడా కలిగి ఉంటుంది.చివరిగా జిఎంయు సెన్సార్ మరియు 5X ఆప్టికల్ జూమ్ తో 48 మెగాపిక్సల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అమర్చారు.

అంతేకాదు ఈ ఫోన్లో ఆకట్టుకునే 100x జూమింగ్ సామర్ధ్యాన్ని అందిస్తుందని కూడా భావిస్తున్నారు. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే.. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఈ స్మార్ట్ ఫోన్లో అమర్చబడి ఉంది.144 Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉండే ఈ ఫోన్, 3200 x 1440 పిక్సెల్, WQHD+ ఆమోలెట్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 2024 లో లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీని ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ .1.16లక్షల వరకు ఉండవచ్చని సమాచారం. Samsung

Click Here to Follow PakkaFilmy in Google News

Join WhatsApp