

Telangana: తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి ఫ్యామిలీకి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి సీబీఐ షాక్ ఇచ్చిందట. ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇస్తూ అడ్డంగా దొరికినట్లు సుశీ ఇన్‌ఫ్రా కంపెనీపై ఆరోపణలు వచ్చాయి. Telangana
Telangana CBI shocks Komatireddy family Sushi Infra company
సుశీ ఇన్‌ఫ్రా లంచాల బాగోతం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సుశీ ఇన్‌ఫ్రా నేరపూరిత కుట్రకు పాల్పడిందంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారట ఢిల్లీ సీబీఐ అధికారులు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో A-15గా మంత్రి కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా పేరు చేర్చినట్లు బీఆర్ ఎస్ పార్టీ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సంతోష్ కుమార్‌కు భారీగా లంచాలు ఇచ్చినట్టు సీబీఐ విచారణలో గుర్తించారట. Telangana
Also Read: Duvvada Srinivas: మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి బైక్ రైడ్..అసలేం జరిగిందంటే?
నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలోని పనుల కోసం అధికారులకు సుశీ ఇన్‌ఫ్రా లంచాలు ఇచ్చినట్లు సమాచారం. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సంతోష్ కుమార్ అకౌంట్లలో దాదాపు రూ.1కోటి వరకు సుశీ ఇన్‌ఫ్రా లంచాలు ఇచ్చారట. ఈ విషయాలను ఆధారాలతో సహా బయటపెట్టిన సీబీఐ.. ఎఫ్ఐఆర్ కాపీ విడుదల చేసిందని అంటున్నారు. ఢిల్లీలో కేసు నెం. RC2172023A004/CBI/AC-II నమోదు చేసిన నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అధికారులు (1/n).. ఈ మేరకు ప్రకటన చేశారట. Telangana
Also Read: Weekend Comments By RK: ఎన్టీవీ ఛానల్ పై ఏబీఎన్ రాధాకృష్ణ స్పెషల్ రిపోర్ట్?







