
Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీ హబ్ లో గవర్నమెంట్ ఆఫీసులు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వచ్చిందట. కమర్షియల్ టాక్స్ ఆఫీస్ అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీసులను టీవీ హబ్ లోకి తరలించేందుకు సిద్ధమైందట. ఒకప్పుడు స్టార్టప్ కంపెనీలకు కేంద్రంగా ఉండేది టీహబ్. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులకు నిలయంగా మారబోతున్నట్లు గులాబీ పార్టీ ప్రచారం చేస్తోంది. Telangana
Telangana Government offices in T Hub
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని విమర్శించే గులాబీ పార్టీ ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టింది. బేగంపేటలో ఉన్న కమర్షియల్ టాక్స్ ఆఫీసు, శేరిలింగంపల్లి, గండిపేట అలాగే రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను బీహార్ లోకి తరలించేందుకు సిద్ధమైందట. దేశంలోనే అధునాతన ఇంక్యుబేటర్ అలాగే ఇన్నోవేషన్ క్యాటలిస్ట్ గా టీహబ్ నిలిచింది. Telangana
Also Read: Naini Coal Mines Tender: కథ అండం తిరిగింది..నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్…
అలాంటి కార్యాలయాన్ని ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసుల కేంద్రంగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని గులాబీ పార్టీ ఫైర్ అవుతోంది. కెసిఆర్ ఆనవాళ్లు చెరిపి వేసేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వెంటనే ఈ అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. లేకపోతే ఉద్యమం చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. అయితే దీనిపై ఇంకా కాంగ్రెస్ స్పందించలేదు. ప్రభుత్వ కార్యాలయాలను టీహబ్ లోకి తరలిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. Telangana
Also Read: Naini Coal Mines Tender: కథ అండం తిరిగింది..నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్…





