Telangana: టీ-హబ్‌ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ?

Telangana
Telangana

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీహాబ్ ను స్టార్టప్ కేంద్రంగా కేంద్రంగానే కొనసాగించాలని తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. అద్దె భవనాలలో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీహాబ్ కు మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. Telangana

Telangana CM Revanth Reddy orders to continue T-Hub as a startup hub

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు కు ఫోన్ చేసి మరి మాట్లాడారట. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. Telangana

Also Read: Harish Rao: రిటైర్ అయ్యాక కూడా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా బొక్క‌లో వేస్తాం

టీ హబ్ ను ప్రత్యేక స్టాటప్పుల కేంద్రంగానే గుర్తించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారట. ఇంక్యుబేటర్ గా అలాగే ఇన్నోవేషన్ క్యాటలిస్ట్ గా స్టార్ టాప్లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ హబ్ లో ఇతర ఆఫీసులు ఉండకూడదని ఆదేశాలు ఇచ్చారట. అలాంటి ఆలోచనలు విరమించుకోవాలని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. Telangana

Also Read: Robo cop: విశాఖ సిటీ రైల్వే స్టేషన్లో ‘రోబో కాప్స‌…కార‌ణం ఇదే!

Share your love