Telangana: స్ట్రాంగ్ రూమ్‌కు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు గల్లంతు.!

Telangana
Telangana

Telangana: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో హైడ్రామా చోటు చేసుకుంది. పాత పాల్వంచలో బ్యాలెట్ బాక్స్ లు పట్టుకెళ్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఓ వ్యక్తి దొరికినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో బ్యాలెట్ బాక్సును, ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు బీఆర్ఎస్ నేతలు. Telangana

Telangana The ballot boxes that were supposed to reach the strong room are missing

47వ డివిజన్ బూత్ నెంబర్ 156 నుండి 10 బ్యాలెట్ బాక్సులు మిస్సింగ్ అయిన‌ట్లు గుర్తించారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు…పాల్వంచ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. బ్యాలెట్ బాక్సుల గల్లంతుపై పోలీసులను నిలదీశారు రేగా. Telangana

Also Read: Dharmapuri Arvind: మాకు ఎవ్వడి మద్దతు అవసరం లేదు ?

ఈ త‌రుణంలోనే ఒక పోలింగ్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మిగతా బాక్సులు ఎక్కడ ఉన్నాయో తేలేదాకా రేగా ఫైర్ అయ్యారు. అంతేకాదు స్టేషన్ నుంచి కదలబోనని స్టేషన్లలో బైఠాయించి ర‌చ్చ చేశారు రేగా కాంతారావు. బ్యాలెట్ బాక్సు గల్లంతుపై ప్రజల్లో అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు తెరలేపి ఉంటుందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.Telangana

Also Read: Vande Mataram: వందేమాతర గీతంపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం