Telusu Kada: ‘తెలుసు కదా’ కి సెన్సార్ షాక్.. బోల్డ్ కంటెంట్ కట్!!

Telusu Kada gets UA certificate

Telusu Kada: సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నీరజా కోన దర్శకత్వంలో రూపొందిన ‘తెలుసు కదా’ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్‌ పూర్తి చేసుకుంది. అక్టోబర్ 17న విడుదల కానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 6 కట్స్‌తో U/A సర్టిఫికెట్ (Certificate) జారీ చేసింది. మొత్తం రన్‌టైమ్ 136 నిమిషాలుగా నమోదు అయింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నిర్మిస్తోంది.

Telusu Kada gets UA certificate

సెన్సార్ బోర్డు సభ్యులు కొన్ని బోల్డ్ డైలాగ్స్ (Bold Dialogues) మరియు విజువల్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ట్రైలర్ చివరలోని “నేను వంగుతా.. వచ్చి ఎక్కు” అనే డైలాగ్‌తో పాటు దానికి సంబంధించిన విజువల్స్‌ను తొలగించారు. అదేవిధంగా “కర్రి నా కొ*కా”, “ముండా”, “సంక నాకుదాం” వంటి పదాలను మ్యూట్ చేశారు (Mute). అలాగే ఒక స్కానింగ్ సీన్ (Scanning Scene) లో చూపించిన “బాయ్” అనే విజువల్‌ను కూడా తీసివేశారు.

దర్శకురాలు నీరజా కోన చెప్పినట్లుగా, సినిమా కథ ప్రేమ, భావోద్వేగాలు, హాస్యం మేళవింపుగా ఉండే మోడర్న్ లవ్ స్టోరీ. అయితే ట్రైలర్ విడుదలయ్యాక సిద్ధూ క్యారెక్టరైజేషన్ (Characterization) కొంచెం బోల్డ్ టచ్‌తో ఉండటం చర్చనీయాంశమైంది. ‘A’ సర్టిఫికేట్ రాకుండా ఉండేందుకు, మేకర్స్ (Makers) సూచించిన కట్స్‌కి అంగీకరించారు.

ఫ్యామిలీ ఆడియన్స్‌ (Family Audience) దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేయడం వల్ల సినిమాకు బజ్ (Buzz) పాజిటివ్‌గా మారింది. గతంలో జాక్ సినిమా విఫలమైన సిద్ధూ ఈసారి పెద్ద హిట్ (Hit)‌ని ఆశిస్తున్నాడు. ‘తెలుసు కదా’ పాటలు, ట్రైలర్‌కి వచ్చిన స్పందన చూస్తే, ఈ సినిమా విడుదలకు ముందు నుంచే మంచి ఆసక్తి రేకెత్తించింది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu