The Raja Saab: బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయం.. ‘ ది రాజా సాబ్’ మూవీ రివ్యూ & రేటింగ్!!

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లోనే ఎప్పుడూ లేని విధంగా హారర్-ఫాంటసీ జోనర్‌లో అడుగుపెట్టిన చిత్రం ‘ది రాజా సాబ్’. దర్శకుడు మారుతి రూపొందించిన ఈ సినిమా, హారర్ మరియు ఫాంటసీ అంశాలతో పాటు రొమాన్స్ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను రంగరించి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తోంది. గత కొంతకాలంగా సీరియస్ యాక్షన్ చిత్రాల్లో కనిపిస్తున్న ప్రభాస్, ఈ సినిమాతో మళ్ళీ తన వింటేజ్ కామెడీ మరియు ఎంటర్టైనింగ్ Space లోకి రావడం విశేషం. భారీ అంచనాల మధ్య నేడు విడుదలైన The Raja Saab విజయాన్ని అందుకుందా లేదా అనేది మా పూర్తి స్థాయి విశ్లేషణలో చూడొచ్చు.

The Raja Saab Movie Review Rating

కథ: కనకరాజు (సంజయ్ దత్) అనే ఒక దురాశాపరుడు, దేవనగర సామ్రాజ్య సిరిసంపదలపై కన్నేసి, రాజ్య జమిందారిణి గంగాదేవిని (జరీనా వాహెబ్) మోసగించాలనుకుంటాడు. తనకు జరిగిన పాత అవమానానికి ప్రతీకారంగా, క్షుద్ర శక్తుల సాయంతో ఆమెను లొంగదీసుకుని, రాజ్య ధనాన్ని దోచుకుని మాయమవుతాడు. ఈ కుట్ర కారణంగా మహారాణి గంగాదేవి సామాన్య మహిళగా బతకాల్సి వస్తుంది. సంవత్సరాల తర్వాత, తన నాయనమ్మ కోరిక మేరకు, తప్పిపోయిన తన తాతను వెతికే బాధ్యతను రాజు (ప్రభాస్) స్వీకరిస్తాడు. అన్వేషణలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న రాజుకు కనకరాజు చేసిన మోసాలు, గంగరాజు (సముద్రఖని) పోషించిన కీలక పాత్ర గురించి నిజాలు తెలుస్తాయి. తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించి, కోల్పోయిన గౌరవాన్ని రాజు ఎలా తిరిగి సంపాదించాడు అనేదే ఈ ఉత్కంఠభరితమైన కథాంశం. డబ్బు కంటే ధర్మం గొప్పదని నిరూపిస్తూ సాగే ఈ ప్రయాణంలో రాజు ఎదుర్కొన్న సవాళ్లు ఆసక్తికరంగా ఉంటాయి.

నటీనటులు: చాలా కాలం తర్వాత ప్రభాస్ తనలోని వింటేజ్ రొమాంటిక్ యాంగిల్‌ను, టైమింగ్ ఉన్న కామెడీని వెండితెరపై పండించి అభిమానులను ఖుషీ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో నాయనమ్మపై కురిపించిన వాత్సల్యం, ఆ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. గ్లామర్ పరంగా మాళవిక మోహనన్ రొమాన్స్‌తో పాటు యాక్షన్‌తోనూ షాక్ ఇవ్వగా, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ సాంగ్స్‌కే పరిమితమైనా స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించారు.

మరోవైపు, విలక్షణ నటుడు సంజయ్ దత్ తాత పాత్రలో హుందాతనాన్ని జోడించగా, జరీనా వాహబ్ తన నటనతో సినిమాకు ప్రాణం పోశారు. యంగ్ జరీనాగా అమ్ము అభిరామి ఆకట్టుకోగా, సముద్రఖని, బొమన్ ఇరానీ తమ అనుభవంతో పాత్రలకు వెయిట్ తీసుకొచ్చారు. ఇక నవ్వుల బాధ్యతను విటివి గణేష్, సత్య, సప్తగిరి బృందం సమర్థవంతంగా మోసింది. హీరోయిన్ ఆనంది మెరుపులా వచ్చి వెళ్లినా గుర్తుండిపోతుంది. వెరసి, నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు ఉత్తమ ప్రదర్శన ఇచ్చి సినిమాను రక్తి కట్టించారు.

సాంకేతిక నిపుణులు: వెండితెరపై ఒక విజువల్ వండర్‌లా నిలిచింది ‘ది రాజా సాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పాటించిన నిర్మాణ విలువల వల్ల ప్రతి ఫ్రేమ్ ఎంతో రిచ్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా నర్సాపూర్ అడవి నేపథ్యంలో రూపొందించిన రాజమహల్ సెట్ ఆర్ట్ విభాగం నైపుణ్యానికి నిదర్శనం. సినిమాటోగ్రాఫర్ తన డార్క్ థీమ్ లైటింగ్‌తో భయానక వాతావరణాన్ని అద్భుతంగా సృష్టించారు. అక్కడక్కడా గ్రాఫిక్స్ (CGI) విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.

సంగీత దర్శకుడు థమన్ తన నేపథ్య సంగీతంతో థ్రిల్లింగ్ సీన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ‘నాచే నాచే’ గీతం దృశ్యకావ్యంలా సాగి అలరిస్తుంది. ఇక దర్శకుడు మారుతి తన పంథాను మార్చుకుని, ఒక విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. కథనంలో కొన్ని చోట్ల సాగతీత లేకుండా ఉంది ఉంటే బాగుండేది. ఎడిటింగ్ మరింత పకడ్బందీగా ఉంది. స్క్రీన్‌ప్లేపై బాగుంది. మొత్తానికి మారుతి మేకింగ్ స్టైల్ ఈ సినిమాకు కొత్త ఊపును తెచ్చింది.

ప్లస్ పాయింట్స్ :

ప్రభాస్ యాక్టింగ్

భారీ నిర్మాణ విలువలు

ఆసక్తికరమైన కథా నేపథ్యం

తీర్పు: చాలా కాలం తర్వాత ప్రభాస్ తన వింటేజ్ కామెడీ మరియు రొమాన్స్‌తో వెండితెరపై మ్యాజిక్ చేశారు. దర్శకుడు మారుతి హారర్ మరియు కామెడీని మేళవించి ఒక కొత్త తరహా అనుభూతిని అందించడంలో సక్సెస్ అయ్యారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన భారీ సెట్లు, థమన్ అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచాయి.డార్క్ థీమ్ విజువల్స్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువల కోసం ఈ చిత్రాన్ని ఖచ్చితంగా చూడాల్సిందే.

ట్యాగ్ లైన్: వింటేజ్ ప్రభాస్ వినోదం

Rating: 3.5/5