“పెద్ది” ఆఫర్ వదులుకున్న మలయాళ హీరోయిన్

రామ్ చరణ్ నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది. ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇలాంటి క్రేజీ మూవీకి నో చెప్పిందట మలయాళ నటి స్వసిక. ఈ విషయాన్ని స్వయంగా స్వాసికనే బయటపెట్టింది. ఇంతకీ కారణం ఏంటంటే.. ఇందులో చరణ్‌ తల్లి పాత్ర కోసం స్వాసికను కాంటాక్ట్ చేశారట. అయితే.. చరణ్‌ కు తల్లి పాత్రలో నటించేందుకు తాను సిద్దంగా లేనని చెప్పి సున్నితంగా ఈ ఆఫర్ కు నో చెప్పిందట.

ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమాలో కన్నడ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అవ్వడంతో పెద్ది సినిమా పై మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మార్చి 27న పెద్ది మూవీ రిలీజ్ కానుంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu