పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ తెరకెక్కిస్తోన్న ఓజీ మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అకిరా నటించాడని ప్రచారం ఊపందుకుంది. ఆమధ్య ఓ ఇంటర్ వ్యూలో ఈ సినిమాకి సంబంధించిన ఆర్టిస్ట్ మాట్లాడుతూ.. ఇందులో పవర్ స్టార్ మూడు దశల్లో కనిపిస్తాడని చెప్పారు. అయితే.. ఆ మూడు దశల్లో యంగ్ ఏజ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గా అకిరా కనిపిస్తాడని న్యూస్ వైరల్ అవుతోంది.
అఖిరా నందన్ స్క్రీన్ మీద కనిపిస్తే ఓజీకి అది మరో హైలైట్ కానుంది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజీ మూవీ రిలీజ్ కానుంది. అయితే.. ఓజీలో అకిరా ఉన్నాడా..? లేడా..? అనే దానిపై క్లారిటీ రావడం లేదు.





