భారత రోడ్లపై Toyota Innova Hycross ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ మొదలు: డిజైన్ మార్పుల వివరాలు ఇవే

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఇప్పుడు భారత రోడ్లపై speed testing లో స్పాట్ చేయబడింది. ఈ న్యూ వెర్షన్ MPV కి కొన్ని డిజైన్ మార్పులు తీసుకురాబోతోందని ఇది క్లారిటీ ఇస్తుంది. టెస్టింగ్ వెహికల్ full camouflage లో ఉన్నా, కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Toyota Innova Hycross Design Refresh

ఫ్రంట్ భాగంలో, ఈ ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ కి కొత్త grille మరియు slim headlamps వస్తున్నట్లు స్పై ఫోటోలు చెబుతున్నాయి. ఈ హెడ్‌ల్యాంప్‌లకి revised projector units ఉండొచ్చు. ఫ్రంట్ బంపర్ కూడా రీడిజైన్ చేయబడింది. side profile లో మాత్రం పెద్ద మార్పులు కనిపించడం లేదు. వెహికల్ వెనుక భాగంలో updated LED tail light elements ఉన్నాయి, ఇది కొత్త లుక్ ఇస్తోంది. ఇంకా, roof spoiler, rear wiper, shark fin antenna వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇంటీరియర్ గురించి పెద్దగా తెలియనప్పటికీ, Toyota కొత్త upholstery, trim finishes మరియు materials తో క్యాబిన్ ని రిఫ్రెష్ చేసే అవకాశం ఉంది. మెకానికల్ సైడ్ లో ఎలాంటి పెద్ద మార్పులు ఉండవు. ఇప్పటి power train options – 2.0L natually aspirated petrol engine (173 bhp) with CVT automatic, మరియు 2.0L strong hybrid (184 bhp) – కొనసాగుతాయని అంచనా.

టయోటా సాధారణంగా మోడల్ లాంచ్ అయిన నాలుగేళ్ళ తర్వాత mid-life updates తీసుకువస్తుంది. అలాగే, Innova Hycross 2022 చివరిలో వచ్చినందున, ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ 2027 ప్రారంభంలో లాంచ్ అయ్యే chances ఉన్నాయి. కొత్త ఫీచర్లు మరియు మార్పులతో ఇది market లో హిట్ అవుతుందేమో చూడాలి.

Share your love