“లెనిన్” సమ్మర్ వరకు ఆగాల్సిందేనా?

అఖిల్ తన కొత్త సినిమా లెనిన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి నాగార్జున నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న లెనిన్ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కావాల్సిఉండగా..పలు కారణాలతో నెక్ట్స్ ఇయర్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న కథ ఇది. ఓ గ్రామీణ ప్రాంతంలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో ఈ కథ ఉంటుందట. అలాగే ఈ కథలో మరో లేయర్ గా ఆలయానికి సంబంధించిన కథ కూడా ఉంటుందట. ఈ మూవీలో కథానాయికగా శ్రీలీలను తీసుకున్నారు. అయితే.. ఆమె బిజీగా ఉండడం వలన ఈ ప్రాజెక్ట్ ను తప్పుకుంది. ఆతర్వాత శ్రీలీల ప్లేస్ భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు. లెనిన్ మూవీని 2026 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Share your love