US Debt: అమెరికా దివాళా తీస్తుందా? 40 ట్రిలియన్ల అప్పులతో గ్లోబల్ మార్కెట్‌లో కలకలం!

donald-trump-hormuz-strait-usa

ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు సరికొత్త టెన్షన్‌ను ఎదుర్కొంటుంది. ఆ దేశాన్ని డెట్ ప్రాబ్లమ్ బాగా భయపెడుతోంది. తాజాగా యూఎస్ జాతీయ రుణం ఏకంగా నలభై ట్రిలియన్ డాలర్ల భారీ మార్కును దాటేసింది. ఈ భారీ అప్పుల ఊబిలో అమెరికా పడిపోవడంతో, అసలు ఆ దేశం దివాళా తీసే పరిస్థితి వస్తుందా అని గ్లోబల్ మార్కెట్‌లో అందరూ మాట్లాడుకుంటున్నారు.

US National Debt Hits Record

నిజానికి గత కొన్నేళ్లుగా అమెరికా గవర్నమెంట్ చేస్తున్న ఖర్చులు వాళ్ళ ఇన్కమ్ కంటే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల బడ్జెట్ లోటు విపరీతంగా పెరిగిపోయి ఎకానమీ మీద తీవ్రమైన భారం పడుతోంది. డిఫెన్స్ ఖర్చులు, సంక్షేమ పథకాలు, ఇతర దేశాలకు ఇస్తున్న ఫైనాన్షియల్ హెల్ప్ కోసం అమెరికా విపరీతంగా అప్పులు చేస్తోంది. దీనికి తోడు ఇంటరెస్ట్ రేట్లు కూడా పెరిగిపోవడంతో, కేవలం అప్పుల వడ్డీలకే వేల కోట్ల డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికన్ డాలర్ మెయిన్ కరెన్సీగా ఉండటంతో ఇప్పటివరకు ఆ దేశం నెట్టుకొస్తుంది. కానీ ఈ రేంజ్‌లో అప్పులు పెరిగిపోతే ఫ్యూచర్‌లో గ్లోబల్ మార్కెట్స్ మీద చాలా నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ముఖ్యంగా ఇన్వెస్టర్లు భయపడి అమెరికా బాండ్ల నుంచి తమ మనీని వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇది జరిగితే డాలర్ వాల్యూ దెబ్బతిని, ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగే రిస్క్ క్లియర్‌గా కనిపిస్తోంది.

ప్రస్తుతానికైతే అమెరికా ప్రభుత్వం ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడేందుకు వేరే ఆప్షన్స్ వెతుకుతోంది. అయితే అక్కడి పాలిటికల్ పార్టీల మధ్య వస్తున్న గొడవల వల్ల డెట్ సీలింగ్ పెంపుపై ఎప్పుడూ పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ ప్రాబ్లమ్‌ను త్వరగా కంట్రోల్ చేయకపోతే, కేవలం అమెరికా ఎకానమీ మాత్రమే కాకుండా మిగతా కంట్రీస్ ఫైనాన్షియల్ కండిషన్స్ కూడా డేంజర్‌లో పడే ఛాన్స్ ఉంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu