“ఉస్తాద్” షెడ్యూల్ ముగిసింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన తన షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా పవన్ తో తీసుకున్న స్టిల్ ను దర్శకుడు హరీశ్ శంకర్ షేర్ చేశారు. మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీద నిలబడటం, మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్లే అంటూ ఈ పోస్ట్ లో రాశారు హరీశ్. మైత్రీ మూవీ మేకర్స్ కూడా హరీశ్ శంకర్ పోస్ట్ ను రీపోస్ట్ చేస్తూ పవన్ సపోర్ట్ వల్లే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పూర్తి చేశామని, ఫ్యాన్స్ ఈ సినిమాను చాలాకాలం థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుంటారని పేర్కొంది.

శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా మరో కీ రోల్ చేస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏపీ డిఫ్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ తన ప్రెజెంట్ మూవీస్ కమిట్ మెంట్స్ పూర్తి చేసి మళ్లీ పాలిటిక్స్ కు ఎక్కువ టైమ్ కేటాయించాలని భావిస్తున్నారు. సెప్టెంబర్ 25న పవన్ ఓజీ థియేటర్స్ లోకి రాబోతోంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu