“దేవర” ఊబిలో చిక్కుకున్న కొరటాల

ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన మూవీ దేవర. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడం.. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదనే ఉద్దేశ్యంతో దేవర 2 చేయాలి అనుకోవడం లేదని ప్రచారం జరిగింది. దీంతో దేవర 2 ఉంటుందా..? ఉండదా..? అనేది సస్పెన్స్ గా మారింది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై ఎన్టీఆర్ స్పందించారు. దేవర పార్ట్ 1 ను మించి దేవర పార్ట్ 2 ఉంటుందని అభిమానులు, మీడియా సమక్షంలో ఎన్టీఆర్ అనౌన్స్ చేశారు. దేవర పార్ట్ 2 ఉంటుందని అయితే చెప్పారు కానీ..ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఎన్టీఆర్ డ్రాగన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్ట్స్ ఇయర్ త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేస్తాడు. ఇది భారీ ప్రాజెక్ట్.. పైగా మైథలాజికల్ మూవీ. దీంతో ఈ సినిమాకి ఎంతలేదన్నా రెండు సంవత్సరాలు పట్టచ్చు. ఇది కంప్లీట్ చేసిన తర్వాత దేవర 2 చేయాలి అనుకుంటున్నాడట ఎన్టీఆర్. దీంతో కొరటాలకు బాగా గ్యాప్ వచ్చేస్తుంది. అందుకనే కొరటాల ప్లాన్ మారిందని..ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. ఏది ఏమైనా కొరటాల దేవర ఊబిలో కూరుకుపోయి బయటకు రాలేకపోతున్నారు.

Share your love