మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ‘వారణాసి’ సినిమా నైజాం rights కోసం ₹150 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇది అన్ని మునుపటి ఏరియా distribution records ను బ్రేక్ చేసేలా ఉండటంతో ట్రేడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఇంత పెద్ద డీల్ ఇంతకు ముందు ఏ సినిమాకు లేదు.
Nizam Rights ₹150 Crore Record
తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, మూవీ మేకర్స్ నైజాం థియేట్రికల్ హక్కుల కోసం ₹150 కోట్లు కోట్ చేశారు. ఇది కేవలం ఒక ఏరియాకే సినిమా హక్కులు అమ్ముడవుతుండటం సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో ఒక మైలురాయి. ఈ ప్రైజ్ ట్యాగ్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తోంది.
రాజమౌళి, మహేష్ బాబు వంటి స్టార్స్ కాంబినేషన్ కావడంతో ‘వారణాసి’ నైజాం హక్కుల కోసం ₹150 కోట్లు డిమాండ్ చేయడం సహజమే అంటున్నారు ట్రేడ్ పండిట్లు. గతంలో RRR, బాహుబలి వంటి సినిమాలకు కూడా ఇంత పెద్డ రికార్డ్ లేదు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్బస్టర్ అవుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.
అయితే ఇంత పెద్ద డిమాండ్ ఉండటంతో కొందరు distributor లు సంశయం వ్యక్తం చేస్తున్నారు. వారణాసి థియేటర్లలో ఎంత వసూలు చేస్తుందో లెక్కించడం కష్టమే. ఈ డిమాండ్ నిజమైతే, ఇది సౌత్ ఇండియన్ సినిమా distribution history లో కొత్త benchmark సెట్ చేస్తుంది. మరి ఏ ప్లేయర్ ఈ డీల్ క్లోజ్ చేస్తారో చూడాలి.





