Varanasi Movie: వారణాసి మూవీ స్టోరీ మొత్తం లీక్.. జక్కన్నకు పెద్ద చిక్కచ్చి పడిందిగా.!

The entire story of Varanasi Movie leaked

Varanasi Movie: మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఒక పెద్ద ఈవెంట్ ఏర్పాటుచేసి అందులో వారణాసి అనే మూవీ టైటిల్ తో పాటు గ్లింప్స్ ని విడుదల చేయడంతో ఈ సినిమాకి భారీ హైప్ పెరిగింది. అయితే ఈ సినిమాలోని గ్లింప్స్ చూసి చాలా మంది చాలా రకాల పోస్టులు నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు.

The entire story of Varanasi Movie leaked

ముఖ్యంగా ఈ సినిమా గ్లింప్స్ ని బట్టి కొంతమంది యూట్యూబ్,ఇంస్టాగ్రామ్ లో వీడియోలు వైరల్ చేస్తూ ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ తమ వీడియోలలో చెప్పుకొస్తున్నారు.అయితే తాజాగా రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న వారణాసి మూవీ కథ ఇదే అంటూ ఒక స్టోరీ వైరల్ అవుతుంది. అదేంటంటే రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి మూవీ కథ ఇదేనట్టు Letterboxd లో పోస్ట్ చేసిన Synopsis వైరల్ అవుతుంది. (Varanasi Movie)

Also Read: Varanasi: “వారణాసి” లో మహేష్ కంటే ఆ హీరో కరెక్ట్.. ఫ్యాన్స్ కొత్త డిమాండ్.!

ఇందులో వారణాసిని ఒక గ్రహ శకలం ఢీ కొన్నప్పుడు అది ఎలాంటి ఘటనలకు దారితీస్తుంది.. ఒకవేళ ప్రపంచం నాశనం అవుతుందా..ప్రపంచం నాశనం అవ్వకుండా ఖండాలు, కాలక్రమాలు దాటాల్సిన రక్షకుడు అవసరమేనా అని ఇందులో రాసి ఉంది. అంతేకాదు ఈ టైం ట్రావెల్ స్టోరీలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ పోషిస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.అలా వారణాసిని కాపాడడం కోసం మహేష్ బాబు రక్షకుడిలా ఈ సినిమాలో కనిపించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది.

The entire story of Varanasi Movie leaked

ఇక ఇప్పటికే వారణాసి మూవీ గురించి స్టోరీ ఇదేనంటూ రకరకాల కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఈ కథనం కూడా వైరల్ అవ్వడంతో ఇది కాస్త నెట్టింట చెక్కర్లు కొడుతుంది.అయితే చాలామంది జనాలు రాజమౌళి మన ఊహకు అందని కథతో వస్తారు. మీరెవరు రాజమౌళి ఊహకు తగ్గట్టు ఊహించలేరు. రాజమౌళి స్టోరీని ఊహించడం అసంభవం అంటూ, ఇప్పటివరకు వైరల్ అయిన కథలన్నింటిని కొట్టి పారేస్తున్నారు.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్ గా.. కనిపించబోతున్నారు.(Varanasi Movie)

Share your love