తమిళ స్టార్ హీరో, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ చివరి సినిమా జననాయకుడు ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా గత సంక్రాంతికి రావాల్సి ఉండగా, సెన్సార్ మరియు కోర్టు వ్యవహారాలతో చాలా ఇబ్బందులు ఎదురై చివరకు జులై 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఇదే టైటిల్‌తో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, మమిత బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
Jananayakudu Movie Release Latest
నిర్మాత వెంకట్ కె. నారాయణ మాట్లాడుతూ, సినిమా రిలీజ్‌కి ఇన్ని ఇబ్బందులు వస్తాయని మేం అనుకోలేదు. విజయ్ గారు కూడా ఇది తన చివరి సినిమా అని, పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్తున్నాను కాబట్టి సమస్యలు తప్పవని ముందే చెప్పారు. మొదట U/A సర్టిఫికెట్ ఇచ్చి, తర్వాత A సర్టిఫికెట్ ఇవ్వడం మాకు చాలా బాధ కలిగించింది, అని ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీ, సెన్సార్, కోర్టు కేసులు ఇలా అనేక సమస్యలు ఒకేసారి ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు.
తాను సినిమా రంగంలోకి ఎలా వచ్చారో కూడా వివరించారు నిర్మాత. బిజినెస్‌లో సక్సెస్ అయినా, సినిమాలంటే నాకు చిన్నప్పటి నుంచీ ఇష్టం. కోవిడ్ సమయంలో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాము. ముందు ఫిల్మ్ ఫైనాన్స్ మరియు డిస్ట్రిబ్యూషన్ చేశాము. రాజమౌళి RRR సినిమా కర్ణాటకలో మేమే డిస్ట్రిబ్యూట్ చేశాం. ఆ తర్వాత నిర్మాతగా మారాను, అని చెప్పారు.
విజయ్ గురించి మాట్లాడుతూ, విజయ్ మేనేజర్‌తో నాకు పరిచయం ఉండటంతో ఒక్క మీటింగ్‌లోనే సినిమా ఓకే అయింది. ఆయన చాలా డిసిప్లిన్ ఉన్న వ్యక్తి, అనుకున్న సమయానికే తన పని చేస్తారు. సీఎం అయ్యాక ఆయన సినిమా థియేటర్లలో చూడటం ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతి. ఈ సినిమా విజయ్ గారి సినీ ప్రయాణానికి ట్రిబ్యూట్‌లా ఉండేలా ప్లాన్ చేశాం, అని తెలిపారు. భగవంత్ కేసరి సినిమాలోని కొన్ని సన్నివేశాలను మాత్రమే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని, మిగిలిన కథ పూర్తిగా కొత్తగా రాసుకున్నామని నిర్మాత చెప్పారు.





