గ్రాండ్ మార్షల్ గా విజయ్ దేవరకొండ

30 ఏళ్లకు పైగా అమెరికాలో ఇండియా డే పెరేడ్ నిర్వహిస్తూ ఖ్యాతి పొందింది ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్. వీరు ఈ ఏడాది 43వ ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి గ్రాండ్ మార్షల్ గా హీరో విజయ్ దేవరకొండ ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఈ నెల 17న మధ్యాహ్నం 12 గంటలకు మాడిసన్ అవెన్యూలో పరేడ్ వేడుకలకు గ్రాండ్ మార్షల్ గా విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. 6 లక్షల మంది సమక్షంలో ఘనంగా ఈ వేడుకలు జరగనున్నాయి.

పహాల్గాం ఉగ్రవాదుల దాడి, అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులకు నివాళులు అర్పించడంతో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని విజయ్ దేవరకొండ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇటీవలే విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu