
vijay sai రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు బహిరంగంగా చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
vijay sai targets sajjala ramakrishna
వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలిపై పార్టీ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఏ కేసులోనూ సజ్జల పేరు ఎందుకు రాలేదనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని కేవలం డమ్మీగా ఉంచి, సజ్జల చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కుటుంబ విషయాల్లోనూ సజ్జల ప్రమేయం వల్లే జగన్కు తల్లి, చెల్లి దూరమయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది. లిక్కర్ స్కామ్లో కొందరిని కావాలనే ఇరికించారనే విమర్శలు కూడా వస్తున్నాయి. పార్టీలో నంబర్ 1, నంబర్ 2 ఎవరనేదానిపై జరుగుతున్న చర్చలు ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో కలవరం రేపుతున్నాయి.
త్వరలోనే ఉత్తరాంధ్రకు చెందిన కొందరు సీనియర్ నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న సీనియర్లు ప్రస్తుతానికి సర్దుకుపోతున్నప్పటికీ, రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయనేది ఉత్కంఠగా మారింది. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఎలాంటిలు మలుపులు తిరుగుతాయో చూడాలి.






