జగిత్యాల జిల్లాలో viral fever విజృంభించి, రెండు రోజుల్లోనే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ షాక్‌లో ముంచేసింది. ఈ వైరల్ ఫీవర్ కేసులు పిల్లలకు భయంకరంగా సోకుతుండడంతో, స్థానిక ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పోరండ్ల గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Viral Fever Kids Death Alert
మొదటి కేసు వివరాల్లోకి వెళితే, జగిత్యాల రూరల్ మండలం పోరండ్లకు చెందిన కాముని అర్జయ-సరిత కొడుకు కాముని వరుణ్ తేజ్ (6) కు తీవ్రమైన జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు వెంటనే అతన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ కండిషన్ మరింత క్షీణించడంతో, కరీంనగర్ లోని హాస్పిటల్‌కు shift చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఆ చిన్నారి కన్నుమూశాడు.
రెండో ఘటన కూడా అదే గ్రామంలోనే జరిగింది. వరుణ్ తేజ్ ఇంటి ఎదుట నివసించే దన్నుల నరేశ్-కావేరి దంపతుల కుమారుడు హార్ స్మిత్ (6) కూడా కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడు. మొదట అతన్ని కూడా జగిత్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు, కానీ గురువారం పరిస్థితి విషమించి కరీంనగర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆ బిడ్డ కూడా ప్రాణాలు వదిలాడు.
ఇద్దరు చిన్నారులు ఒకే ప్రైవేట్ స్కూల్లో చదువుతుండటం, కేవలం రెండు రోజుల వ్యవధిలో చనిపోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. దీంతో గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించి, అందరి పిల్లలను పరీక్షించారు. ఈ viral fever కేసులు ఇంకా కొనసాగితే పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.





