
Kids: చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా ఉండాలని తరచు ఇంట్లో పెద్దవారు దిష్టి తీస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది చూపు అస్సలు మంచిది కాదు. ప్రేమతో లేదా కోపంతో కలిగే కంటి చూపు వల్ల చాలా వరకు పిల్లలు తొందరగా అనారోగ్యానికి గురవుతారు. పిల్లలు నీరసంలో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురైనప్పుడు లేదా తరచూ ఏడుస్తున్నప్పుడు నరదిష్టి తొలగిపోవాలని భావించి దిష్టి తీస్తారు. ఇది పురాతనమైన సాంప్రదాయం. ప్రేమతో చూసే చూపు కూడా కొన్నిసార్లు అనారోగ్యానికి కారణం అవుతుందని నమ్ముతారు. దీనిని నరదిష్టి అంటారు. నర దిష్టి పిల్లలకు తగలకుండా కాపాడడానికి చాలామంది దిష్టి తీస్తారు. పిల్లలు అనారోగ్యానికి గురైన సమయంలో కూడా దిష్టి తీస్తూ ఉంటారు. నీరసంగా ఉన్నప్పుడు దిష్టి తీయడం చాలా మంచిది. Kids
Do you know why Kids are bullied
ఇదంతా నరదిష్టి వల్లనే అని భావించి దిష్టి తీస్తారు. దీనివల్ల పిల్లలు వేగంగా కోలుకుంటారని నమ్ముతారు. ఇది పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. పిల్లలు నరదిష్టి వల్ల బాధపడకుండా ఉండడానికి ఇలా చేస్తారు. దానివల్ల పిల్లలకు నీరసం, అనారోగ్యం దరిచేరకుండా ఉంటుందని దిష్టి తీయడం వల్ల వారికి రక్షణ కలుగుతుందని నమ్ముతారు. కొన్నిసార్లు పిల్లలకు రాళ్ల ఉప్పుతో దిష్టి తీస్తారు. రాళ్ల ఉప్పుతో దిష్టిని తీసేయడం వల్ల పిల్లలు చాలా తొందరగా కోలుకుంటారు. ఉప్పును పిల్లల చుట్టూ మూడుసార్లు తిప్పి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేస్తారు. మరి కొంతమంది అన్నంతో దిష్టి తీస్తారు. Kids
Also Read: Danish Kaneria: ఇండియాకు వచ్చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్.. నా మాతృభూమి అంటూ పోస్ట్ ?
అన్నంతో పిల్లలకు దిష్టి తీసేసి ఆ అన్నాన్ని నలుగురు తిరిగే చోట్ల రోడ్డుపైన వేస్తారు. పూర్వకాలం నుంచి పెద్దలు పుట్టినప్పటినుంచి చిన్నపిల్లలకు రెండు సంవత్సరాలు వచ్చే వరకు కాటుక చుక్కతో దిష్టి తగలకుండా బుగ్గపై చుక్క పెడతారు. దీనివల్ల చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుందని నమ్ముతారు. ఇంట్లో పెద్దవారు ఉన్నట్లయితే జీడిగింజలతో దిష్టి తీస్తారు. దీనివల్ల పిల్లలకు నరదిష్టి, అనారోగ్యం ఉన్నట్లయితే తొందరగా వెళ్ళిపోతాయి. పిల్లలకు దిష్టి తొందరగా తగులుతుంది దానివల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక చిన్న పిల్లలకు నిమ్మకాయతో దిష్టి తీసినట్లైతే చాలా తొందరగా పరిష్కారం దొరుకుతుంది. నిమ్మకాయతో దిష్టి తీసి పారే నీటిలో పాడేయాలి దానివల్ల దిష్టి తొందరగా పోతుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.
Also Read: Banana Peel: ఆరటి పండు తిని దాని తొక్కను పడేస్తున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి?

