టీడీపీలో చేరడంపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్!!

2024 ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి అని ఓ ఇంటర్వ్యూ లో అడగగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కలసి నిర్ణయం త్వరలోనే తీసుకుంటాం అన్నారు.

సినిమా వేరు, రాజకీయం వేరు. పాలిటిక్స్ అనేది ఒక బాల్ గేమ్  దానిలో కేవలం నా ఒక్కడి నిర్ణయం మాత్రమే కాదు ఇది ఫ్యామిలీ విషయం అన్నారు.  

మేము చేస్తున్న దేవర సినిమా పైనే మా పూర్తి దృష్టి ఉంది. అందరూ దేవర సినిమా గురించి అడుగుతున్దడంతో ఆ ప్రెజర్ మా మీద ఎక్కువగా ఉంది.

మద్దతు ఎటు అన్న విషయమై ఒక కుటుంబంగా కూర్చుని మాట్లాడాలి, అయితే ఇంకా మేము ఆ స్పేస్ తీసుకోలేదు అని కళ్యాణ్ రామ్ అన్నారు.   

ఒకసారి ఆ స్పేస్ లోకి వెళితే అందరికంటే ముందు మీకే చెబుతాం అని అన్నారు. కళ్యాణ్ రామ్ ఇటీవలే డెవిల్ అనే సినిమా తో పలకరించాడు.