పోస్టాఫీసులో పిల్లల గురించి ప్రత్యేక పొదుపు పథకం.. అదిరే వడ్డీ రేటు

పోస్టాఫీసులో పిల్లల గురించి ప్రత్యేక పొదుపు పథకం.. అదిరే వడ్డీ రేటు

పిల్లలు పుట్టడం సంతోషమే అయినా పెరిగే ఖర్చులు తల్లిదండ్రులకు భారమే. అలాంటి వారు కొన్ని హామీ ఉన్న రిస్క్ లేని పెట్టుబడులను ఇష్టపడతారు.  

ముఖ్యంగా పోస్టాఫీస్ పథకాలు ఇలాంటివే. ఇవి హామీతో కూడిన రాబడిని అందిస్తాయి కాబట్టి చాలా మంది వాటిని పెట్టుబడిగా ఎంచుకున్నారు. 

అలా పిల్లల కోసం స్పెషల్ గా తయారు చేసిందే 'బాల్ జీవన్ బీమా పథకం'. ఇది పిల్లలకు జీవిత బీమా రక్షణను అందిస్తుంది. 

ఈ పథకం ప్రయోజనం పొందాలంటే పిల్లలు 5 నుండి 20 సంవత్సరాల వయస్సు ఉండాలి.  తల్లిదండ్రుల వయస్సు 45 ఏళ్లు మించకూడదు.

ఈ పథకంలో మెచ్యూరిటీపై రూ. 3 లక్షల వరకు హామీ మొత్తం లభిస్తుంది. ఈ పాలసీని తీసుకుంటే రూ. 1000 హామీ మొత్తంపై మీకు ప్రతి సంవత్సరం రూ. 48 బోనస్.

ఈ ప్లాన్‌లో ప్రీమియం చెల్లించడం తల్లిదండ్రుల బాధ్యత, కానీ పాలసీ మెచ్యూరిటీకి ముందే వారు మరణిస్తే, పిల్లల ప్రీమియం మాఫీ అవుతుంది.