జాజి కాయల వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..?

మన వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాల్లో జాజికాయ ఒకటి. ఇది మనందరికి తెలిసిందే. మసాలా వంటకాల్లో దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటాము. 

ఈ జాజికాయ మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చాలా తక్కువ మందికి తెలుసు. దీనిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. 

ఆయుర్వేదంలో కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇది ఔషధం. దీనితో కషాయాన్ని చేస్తారు. అలాగే పొడిగా చేసి ఔషధంగా వాడుతూ ఉంటారు. 

దీనిని వాడడం వల్ల శరీరంలో ఉండే ధాతువులు చక్కగా పని చేస్తాయి. అనేక సమస్యలు దూరమవుతాయి. 

పిల్లలు బరువు పెరుగుతారు. వారిలో ఎముకలు ధృడంగా అవుతాయి. నడుము నిలబడని పిల్లలకు నడుము చక్కగా నిలబడుతుంది. పెద్దలు కూడా ఈ పొడిని తీసుకోవచ్చు.