తెలంగాణ లో గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ సర్కారు

కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి  పథకాన్ని రద్దు చేసింది. 

ఈ పథకం స్థానంలో అభయహస్తం పేరుతో రూ. 5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది కాంగ్రెస్ సర్కారు.

లబ్ధిదారులకు కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పత్రాలను కూడా రద్దు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం దాని స్థానంలో అభయహస్తం పథకాన్ని అమలు చేస్తోంది. 

హైదరాబాద్‌ ​ను కాలుష్య రహిత అర్బన్ గ్రోత్ హబ్​గా చేయాలని దానికి  తగిన సహకారం అందించాలని రేవంత్  నీతి ఆయోగ్​ బృందాన్ని కోరారు. 

భాగ్యనగరానికి వచ్చిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ, సభ్యుడు వీకే సారస్వత్​తో సచివాలయంలో సీఎంతో సమావేశమయ్యారు.