
Nayanthara: బాలకృష్ణ నయనతార కాంబోలో వచ్చిన శ్రీరామరాజ్యం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. సీతారాముల స్టోరీ, లవకుశల గాధ ని అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా తెరకెక్కించారు దర్శకుడు బాపు.. అయితే అలాంటి ఈ సినిమాలో రాముడిగా నందమూరి బాలకృష్ణ సీతాదేవిగా నయనతార నటించిన సంగతి మనకు తెలిసిందే.
What happened during Balakrishna Sri Rama Rajyam Nayanthara crying
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నయనతార విపరీతంగా ఏడ్చేసిందట. ఇదే నా చివరి సినిమా.. ఇక సినిమాల్లో నటించను అని చిత్ర యూనిట్ అందరితో చెప్పి కన్నీళ్లు పెట్టుకుందట. దాంతో నయనతార ప్రవర్తన చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. ఎందుకు నయనతార ఇలా కన్నీళ్లు పెట్టుకొని ఇదే నా చివరి సినిమా అంటుంది అని షాక్ లో మునిగిపోయారట. (Nayanthara)
కానీ నయనతార ఇక నేను సినిమాలకు గుడ్ బై చెబుతున్నానని, ఇది నా చివరి ఫిలిం అంటూ చెప్పిందట.అయితే ఈ మాటలు చెప్పడానికి కారణం గతంలో నయనతార ప్రభుదేవాతో పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయింది. ఆ సమయంలో ప్రభుదేవా నయనతారని పెళ్లి చేసుకోవడానికి ఓ కండిషన్ పెట్టాడు.

నువ్వు పెళ్లయ్యాక సినిమాల్లో నటించకూడదని కండిషన్ పెట్టారు. అలా ప్రభుదేవా మీద ఉన్న ఇష్టంతో ఆయనతో పెళ్లి కోసం సినిమాలకు గుడ్ బై చెప్పడానికి కూడా నయనతార వెనకాడ లేదు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ నయనతార ప్రభుదేవా మధ్య బ్రేకప్ అయ్యి మళ్లీ సినిమాల్లో కొనసాగింది నయనతార.(Nayanthara)





