Sunil: ఆయనే నాకు లైఫ్ ఇచ్చారు.. సునీల్ ఎమోషనల్ కామెంట్స్..!

 Sunil emotional comments that he gave me life

Sunil: కమెడియన్ సునీల్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన ఇప్పుడు కమెడియన్ కాదు పాన్ ఇండియా లెవెల్ లో స్టార్..కలర్ ఫోటో సినిమాతో మొదటిసారి తనలో ఉన్న విలనిజాన్ని బయటపెట్టిన సునీల్ ఆ తర్వాత పుష్ప సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టేసారు.అయితే అలాంటి సునీల్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో కామెడీ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. అలా అందాల రాముడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు వంటి సినిమాలతో హీరోగా కూడా మారారు. అయితే అలాంటి సుమన్ కి లైఫ్ ఇచ్చింది మాత్రం ఆయనేనట.

Sunil emotional comments that he gave me life

ఆయన లేకుంటే నేను ఉండేవాడిని కాదు అంటూ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ సునీల్ కి లైఫ్ ఇచ్చింది ఎవరయ్యా అంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. అయితే త్రివిక్రమ్ నీ ఇండస్ట్రీకి తీసుకు వచ్చింది సునీలే..ఎలా అంటే సునీల్ సినిమాల్లోకి వద్దాం అనుకున్న సమయంలో చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారట.ఆ సమయంలో ఆయనకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. కానీ చిరంజీవి చేసే డాన్సులు చూసి నేర్చుకొని కాలేజీ ఫంక్షన్స్ లో చేసే వారట. ఆ తర్వాత మోహన్ బాబు అంటే సునీల్ కి చాలా ఇష్టమట. (Sunil)

Also Read: Nayanthara: బాలకృష్ణ శ్రీరామరాజ్యం సమయంలో ఏం జరిగింది.. నయనతార ఏడ్చుకుంటూ.!

ఆయన విలనిజం నచ్చి మోహన్ బాబులా విలన్ గా చేయాలి అని అనుకున్నారట. అదే సమయంలో కామెడీ విలన్ అవుదాం అనుకొని మోహన్ బాబు గారు మొదట దాసరి సత్యనారాయణ రావు గారి దగ్గర అసిస్టెంట్ గా చేశారు.కాబట్టి మోహన్ బాబు గారి స్కిల్స్ ఏంటో ఆయనకు తెలుసు. అలాగే నేను కూడా ఎవరి దగ్గరనైనా వర్క్ చేస్తే నాలో ఉన్న టాలెంట్ ఏంటో గుర్తించి నాకు అవకాశాలు ఇస్తారు అని అనుకున్నారట.

 Sunil emotional comments that he gave me life

అలా సునీల్ కజిన్ క్లాస్మేట్ అయినటువంటి త్రివిక్రమ్ కి సినిమాల్లో డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉందనే విషయం తెలుసుకొని త్రివిక్రమ్ తో కలిసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారట. ఇక విచిత్రం ఏమిటంటే సునీల్ త్రివిక్రమ్ ని ఇండస్ట్రీకి తీసుకువస్తే త్రివిక్రమే ఆయనకు లైఫ్ ఇచ్చారు. అలా ఆయన సినిమాల్లో సునీల్ కోసం ఎన్నో పాత్రలు రాశారు. ఇక ఈ విషయాన్ని తలుచుకొని సునీల్ ఎమోషనల్ గా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.(Sunil)

Share your love