Kranti Gaud: లేడీ బుమ్రా దెబ్బ అదుర్స్‌.. తండ్రికి మళ్ళీ పోలీస్ జాబ్…!

Kranti Gaud: ఉమెన్స్ వరల్డ్ కప్ విన్నింగ్ టీం సభ్యురాలు అయినా క్రాంతి గౌడ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఫైనల్ లో టీమిండియా విజయం సాధించింది. మొదటిసారిగా మహిళల వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా, క్రాంతి గౌడ్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 2012లో ఎన్నికల సమయంలో చిన్న పొరపాటు వల్ల క్రాంతి గౌడ్ తండ్రి మున్నా సింగ్ పోలీస్ ఉద్యోగం కోల్పోయాడు. Kranti Gaud

Kranti Gaud Father Reinstated as Police Officer After India’s World Cup 2025 Win

తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం మున్నా సింగ్ కు తిరిగి తన కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఇప్పిస్తామని పేర్కొన్నారు. దీంతో క్రాంతి గౌడ్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన తండ్రి మున్నా సింగ్ ను తిరిగి మళ్లీ పోలీస్ యూనిఫామ్ లో చూడడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆయన గౌరవంగా రిటైర్ అయ్యేలా చూడడమే తన కోరిక అంటూ క్రాంతి గౌడ్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఒకానొక సమయంలో తమ కుటుంబం ఎంతో పేదరికాన్ని అనుభవించినట్లుగా క్రాంతి చెప్పారు. Kranti Gaud

Also Read: Cm Revanth Reddy: రేవంత్ రెడ్డి కుటుంబంలో అంతర్గత గొడవలు… తిరుపతి రెడ్డితో విభేదాలు…

తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నుంచి ఇప్పుడు గొప్ప స్థాయికి వచ్చామని క్రాంతి గౌడ్ వెల్లడించారు. క్రాంతి గౌడ్ షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. క్రాంతి గౌడ్ ను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. మొన్న జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో తన అద్భుతమైన ఆట తీరుతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. Kranti Gaud

Also Read: CM Revanth Reddy: కుమారీ ఆంటీ చెప్పింది, కానీ రాహుల్‌, సోనియా శుభాకాంక్ష‌లు చెప్ప‌లేదా…