Balayya: బాలయ్యకు ఎల్లో మీడియా వెన్నుపోటు…ఇక ఒంటరివాడు కానున్నాడా?

Balayya: హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య ఇటీవల కాలంలో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు మెగాస్టార్ చిరంజీవి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అనేక విమర్శలను ఎదుర్కొంటున్నారు నందమూరి బాలయ్య. రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీలో సైకో అంటూ జగన్మోహన్ రెడ్డిని అలాగే వాడు వీడు అంటూ మెగాస్టార్ చిరంజీవిని పచ్చి బూతులు తిట్టి నందమూరి బాలయ్య అడ్డంగా దొరికిపోయారు. Balayya

Yellow Media Targets Balayya

ఎలా చూసినా ఈ విషయంలో నందమూరి బాలయ్యది తప్పు అని చాలామంది చెబుతున్నారు. ఆయనను ఎప్పుడు పొగిడే వాళ్లు కూడా తిడుతున్నారు. ఇక వైసిపి ఈ విషయంలో రెచ్చిపోయి ప్రవర్తిస్తోంది. గతంలో బెల్లంకొండ సురేష్ అలాగే నేపాలి సెక్యూరిటీ మృతి సంఘటనను తీసుకువచ్చి, నందమూరి బాలయ్య కు పిచ్చాసుపత్రికి సంబంధించిన సర్టిఫికెట్ ఉందని వైరల్ చేస్తుంది. దీంతో ఈ విషయంపై నందమూరి బాలయ్య మరింత ఒత్తిడిలోకి వెళ్లారు. ఇంత జరుగుతున్న అటు పవన్ కళ్యాణ్ అలాగే నారా చంద్రబాబు నాయుడు పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. Balayya

Also Read: Banana Peel: ఆరటి పండు తిని దాని తొక్కను పడేస్తున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి?

ఇలాంటి నేపథ్యంలో నందమూరి బాలయ్యకు ఊహించని షాక్ తగిలింది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన కొన్ని ఎల్లో మీడియా సంస్థలు… నందమూరి బాలయ్య చేసిన తప్పిదాలను ఎత్తి చూపిస్తున్నాయి. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలయ్య కు సభా మర్యాదలు తెలియవా అంటూ ఎల్లో మీడియా ఒకటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నాయకులు అలాగే గౌరవప్రదమైన వ్యక్తుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ మాట్లాడాలని మరో న్యూస్ ఛానల్ కథనాలను ప్రచూరణ చేస్తోంది. నీతో నందమూరి బాలయ్య ఒంటరివాడయ్యాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. Balayya

Also Read: Danish Kaneria: ఇండియాకు వచ్చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్.. నా మాతృభూమి అంటూ పోస్ట్ ?

Share your love