Ridge Gourd: బీరకాయ ప్రతిరోజు తింటున్నారా..అయితే ఒక్కరిసారి ఇవి తెలుసుకోండి?

Ridge Gourd

Ridge Gourd: బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. బీరకాయను కొంతమంది తినడానికి అస్సలు ఇష్టపడరు. బీరకాయలో పోషకాలు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధిక మోతాదులో ఉంటాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయం చేస్తుంది. బరువు తగ్గాలని అనుకునే వారు బీరకాయలు తప్పకుండా తినాలి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల బరువు తగ్గేవారికి ఎంతో చక్కగా పనిచేస్తుంది. బరువు తగ్గాలని అనుకునేవారు ప్రతిరోజు ఉదయం పూట బీరకాయను ఉడికించుకొని తిన్నట్లయితే వారు వేగంగా బరువు తగ్గుతారు. బీరకాయలో శరీరానికి కావలసిన పోషకాలు, మినరల్, విటమిన్లు అధికంగా ఉంటాయి బీరకాయను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే మలబద్ధకం తొలగిపోతుంది. Ridge Gourd

Health Benefits of Ridge Gourd

జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. సెల్యూలోజ్ మలబద్దకాన్ని నివారించడంలో అధికంగా సహాయం చేస్తుంది. బీరకాయలో విటమిన్ సి, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి బీరకాయలు ఎంతగానో శక్తిని ఇస్తాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయకారిగా పనిచేస్తుంది. షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. బీరకాయను డయాబెటిస్ ఉన్నవారు తినడం వల్ల వారి రక్తంలో ఉండే చక్కర స్థాయిలో క్రమక్రమంగా తగ్గుతాయి. వారి ఆరోగ్య పనితీరు మెరుగు పడుతుంది. బీరకాయలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల శరీరంలో ఉండే అవయవాలు బలంగా తయారవుతాయి. గర్భిణీ స్త్రీలు కూడా డెలివరీ అనంతరం బీరకాయని తిన్నట్లయితే వారి ఆరోగ్యానికి చాలా మంచిది. వారి శరీరం బలంగా తయారవుతుంది. బీరకాయ తినడం వల్ల స్త్రీల శరీరానికి అవసరమైన బలం చేకూరుతుంది. Ridge Gourd

Also Read: Renu Desai: పవన్ కళ్యాణ్ తప్ప నీ లైఫ్ లో వేరే మగాడు ఉండకూడదు.. రేణు దేశాయ్ కి ఫ్యాన్స్ వార్నింగ్.?

దీనిని అధికంగా తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. వారంలో రెండు సార్లు తప్పకుండా బీరకాయని తినాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. బీరకాయను ఫ్రై చేసుకుని తినవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు. ఏ రకంగా అయినా సరే బీరకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా బీరకాయను తప్పకుండా కనిపించాలి. బీరకాయని తినిపించడం వల్ల పిల్లల ఎదుగుదల బాగుంటుంది. వారి ఆరోగ్య పనితీరు మెరుగుపడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చాలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. వారంలో రెండుసార్లు చిన్నపిల్లలకు బీరకాయని తినిపించినట్లైతే వారికి చాలా మంచిది. బీరకాయతో పచ్చడి కూడా చేసుకొని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. చాలామంది బీరకాయ తినడానికి ఇష్టపడని వారు బీరకాయతో పచ్చడి చేసుకొని తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పచ్చిమిర్చి, పల్లీలు, నువ్వులు వేసుకొని పచ్చడి చేసుకోవడం వల్ల చాలా మంచి రుచిని ఇస్తుంది. శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి.

Also Read: Jagan: జగన్ కు గండం మారిన అల్లుడు.. వైయస్ వారసుడిగా రంగంలోకి ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu