
Bobbarlu: బొబ్బర్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. బొబ్బర్లలో విటమిన్లు, పోషకాలు, ఐరన్, రాగి, మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్, సోడియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఒక కప్పు బొబ్బర్లను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. బొబ్బర్లను ఉడికించుకొని ఉదయం పూట తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని వీటిలో ఉంటాయి. వీటిని ఉడకబెట్టి తిన్నట్లయితే శరీరానికి ఫైబర్, విటమిన్లు, పోషకాలు అధికంగా అందుతాయి. బొబ్బర్లను తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి అనిపించదు. కడుపు నిండుగా ఉంటుంది. దానివల్ల ఆహారం చాలా తక్కువగా తీసుకుంటారు. వేగంగా బరువు తగ్గుతారు. గర్భిణీ స్త్రీలకు బొబ్బర్లు ఎంతగానో మేలు చేస్తాయి.
Health Benefits with Bobbarlu
గర్భంలో శిశువు ఎదుగుదలకు బొబ్బర్లు సహాయం చేస్తాయి. బొబ్బర్లు తినడం వల్ల శరీరంలో రక్తహీనత లాంటి సమస్యలు తొలగిపోతాయి. ఇందులో క్యాన్సర్ కణాలను తొలగించే సామర్థ్యం వీటికి కలదు. బొబ్బర్లు తిన్నట్లయితే గుండె ఆరోగ్య పనితీరు మెరుగు పడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు చర్మాన్ని బలంగా మృదువుగా తయారు చేస్తుంది. శరీరంలో ఉండే చెడు బ్యాక్టీరియాలను తొలగించడంలో బొబ్బర్లు ఎంతగానో సహాయం చేస్తాయి. బొబ్బర్లు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు బొబ్బర్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.
Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న వెనుక కేసీఆర్…పార్టీ పేరుతో స్కెచ్ ?
ప్రతి రోజు ఒక కప్పు బొబ్బర్లను తిన్నట్లయితే 200 క్యాలరీల శక్తి సామర్థ్యం శరీరానికి అందుతుంది. బొబ్బర్లను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే పొటాషియం శరీరంలో రక్తసరాఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో బిపి కంట్రోల్ లో ఉంటుంది. హైబీపీ, షుగర్ లాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఒక కప్పు బొబ్బర్లను ఉడకబెట్టుకుని తిన్నట్లయితే వారి ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.
Also Read: Kalvakuntla Kavitha: BRS నేతలు నాతో టచ్ లో ఉన్నారు




















