Corn silk: మొక్కజొన్న పీచే కదా అని పడేస్తున్నారా…. అయితే ఇవి తెలుసుకోండి ?

Corn silk benefits

Corn silk: మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. మొక్కజొన్నను ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మొక్కజొన్నలు తింటూ ఉంటారు. మొక్కజొన్నలు ముఖ్యంగా ప్రయాణ సమయాలలో అధికంగా తింటూ ఉంటారు. ఇది టైం పాస్ కోసం తినడానికి దీనిని ఆసక్తి చూపిస్తారు. కానీ ఇది కడుపు ఎంతో నిండుగా ఉంచుతుంది. ఆకలి అనిపించదు. మొక్కజొన్నలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. మొక్కజొన్నలు కొంతమంది కాల్చుకొని తింటే మరికొంతమంది ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు. Corn silk benefits

Corn silk benefits For Human

మొక్కజొన్నలను ఉడకబెట్టుకొని తినడం వల్ల అధికంగా పోషకాలు శరీరానికి అందుతాయి. ఇందులో విటమిన్లు, పోషకాలు, ఫైబర్, కాపర్, జింక్, మాంగనీస్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. మొక్కజొన్నను ఉడకబెట్టి తినే ముందు చాలామంది దాని పైన ఉన్న పీచును తీసిపారేస్తూ ఉంటారు. మొక్కజొన్న పీచుతో ఎన్నో రకాల లాభాలు ఉంటాయని వైద్య నివేదికలో వెళ్లడైంది. మొక్కజొన్న పీచును మనం చెత్తగా భావిస్తాము. దీనిని తీసి చెత్తలో పాడేస్తాము. అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం మొక్కజొన్న పీచును అనేక రకాల ఆయుర్వేద మందులలో వాడేవారు. మొక్కజొన్న పీచులో విటమిన్లు, విటమిన్ బి, విటమిన్ కె లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. Corn silk benefits

Also Read: Tollywood: నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూ..రంగంలోకి రేవంత్ స‌ర్కార్?

దీనిని టీ తయారుచేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మరిగే నీటిలో మొక్కజొన్న పీచును వేసుకొని అరగంట పాటు మరిగించి తీసేసి ఆ నీటిని తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల కిడ్నీలో పేరుకుపోయిన చెత్తచెదారం తొలగిపోతాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లయితే ఈ నీటిని తాగినట్లయితే చాలా మంచిది. మొక్కజొన్న పీచుతో టీ చేసుకుని తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. ఇది బరువు తగ్గాలని అనుకునే వారికి ఎంతో మంచిది. ఇది శరీరంలో ఉన్న అధిక కొవ్వును కరిగిస్తోంది. దానివల్ల వేగంగా బరువు తగ్గుతారు. ఇది పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వు వేగంగా కరగడానికి అధికంగా సహాయం చేస్తుంది. మొక్కజొన్న పీచుతో టీ చేసుకుని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొక్కజొన్న పీచుతో టీ చేసుకుని తయారు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. పూర్వకాలంలో దీనిని చాలా మంది వాడేవారు. Corn silk benefits

Also Read: Green Tea: ప్రతిరోజు గ్రీన్ టీ తాగుతున్నారా…అయితే డేంజర్ లో పడ్డట్టే ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu