Puri Jagannadh: మహేష్ ఒప్పుకున్నా నేను సినిమా చేయను.. పూరి జగన్నాథ్ ఓపెన్ స్టేట్మెంట్.!

Puri Jagannadh: మహేష్ బాబు ని ఇండస్ట్రీలో పెద్ద హీరోని చేసిందే పూరి జగన్నాథ్.. ఎందుకంటే పూరి జగన్నాథ్ మహేష్ బాబుకి పోకిరి, బిజినెస్ మాన్ వంటి రెండు ఇండస్ట్రీ హిట్

Puri Jagannadh open statement

Puri Jagannadh: మహేష్ బాబు ని ఇండస్ట్రీలో పెద్ద హీరోని చేసిందే పూరి జగన్నాథ్.. ఎందుకంటే పూరి జగన్నాథ్ మహేష్ బాబుకి పోకిరి, బిజినెస్ మాన్ వంటి రెండు ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందించారు.అలాంటి అద్భుతమైన హిట్స్ ని అందించిన పూరి జగన్నాథ్ కి మహేష్ బాబుకి మధ్య ప్రస్తుతం సఖ్యత లేదు అనే సంగతి మనకు తెలిసిందే. అయితే దీనికి కారణం నమ్రత అనే రూమర్ వినిపించింది.

Puri Jagannadh open statement

మహేష్ బాబుతో ఓ సినిమా చేద్దామని మహేష్ ఇంటికి పూరి జగన్నాథ్ వెళ్ళినప్పుడు ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నారని ఇప్పుడు సినిమా చేసే యోచన లో లేరు అన్నట్లుగా నమ్రత మాట్లాడడంతో పాటు మహేష్ బాబు కనీసం స్పందించకపోవడంతో పూరి జగన్నాథ్ హర్ట్ అయ్యారు. దాంతో చాలా రోజుల నుండి పూరి జగన్నాథ్ మహేష్ బాబు మధ్య మాటలు లేవు. (Puri Jagannadh)

Also Read: Allu Family: అల్లు ఫ్యామిలీని ఏకిపారేస్తున్న నెటిజెన్స్.. హిందువులై ఉండి అలా ఎలా చేస్తారంటూ ఫైర్.!

అయితే ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో మీరు మళ్ళీ సినిమా చేస్తారా అని పూరి జగన్నాధ్ ని యాంకర్ ప్రశ్నించగా..అస్సలు ఛాన్సే లేదు. ఒకవేళ మహేష్ బాబే వచ్చి నేను సినిమా చేస్తానని చెప్పినా కూడా ఆయనతో కలిసి చేయడానికి నేను సుముఖంగా లేను.ఆయనతో సినిమా ఎప్పటికీ చేయను అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు పూరి జగన్నాథ్.

Puri Jagannadh open statement

అయితే పూరి జగన్నాథ్ మొదట జనగణమన సినిమాని మహేష్ బాబు తోనే చేస్తానని ప్రకటించారు. కానీ సడన్గా వీరిద్దరి మధ్య గ్యాప్ రావడంతో ఆ సినిమా విజయ్ దేవరకొండ తో అనుకున్నారు.కానీ విజయ్ దేవరకొండ తో కూడా ఈ సినిమా తెరకెక్కలేదు. ఇక పూరి జగన్నాథ్ ని మహేష్ బాబు ఎంతలా అవమానిస్తే అలాంటి మాటలు మాట్లాడతారో అర్థం చేసుకోవచ్చు.(Puri Jagannadh)