Puri Jagannadh: ఆ స్టార్ హీరోయిన్ కాళ్ళు మొక్కిన పూరి జగన్నాథ్, రవితేజ..!

Puri Jagannadh and Ravi Teja touching the feet of that star heroine

Puri Jagannadh: పూరి జగన్నాథ్ తనకంటే వయసులో చిన్నదైనా ఒక హీరోయిన్ కాళ్లు మొక్కారట. అది కూడా ప్రతిరోజు షూటింగ్ సెట్ కి రావడంతోనే. మరి ఇంతకీ పూరి జగన్నాథ్ ఏ హీరోయిన్ కాళ్ళు మొక్కారు. తనకంటే వయసులో చిన్నదైనా సరే ఆ హీరోయిన్ కాళ్లు ఈ డైరెక్టర్ ఎందుకు మొక్కారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దర్శకుడు పూరి జగన్నాథ్ ఒకప్పుడు వరుస హిట్లతో తన హవా కొనసాగించాడు. ఆయన సినీ, కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్లు ఇండస్ట్రీ హిట్లతో తన హవా కొనసాగించాడు.

Puri Jagannadh and Ravi Teja touching the feet of that star heroine

ముఖ్యంగా ఇప్పుడున్న మహేష్ బాబు, రవితేజ,పవన్ కళ్యాణ్ వంటి వారిని స్టార్ హీరోలుగా మార్చిందే ఈ డైరెక్టర్. ఎందుకంటే ఈయనతో సినిమాలు చేయక ముందు వరకు ఈ హీరోల అందరికీ అంత పేరు స్టార్డం లేదు.కానీ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సినిమాలు చేశాకే వారికి స్టార్ హీరోల గుర్తింపు దక్కింది.అయితే అలాంటి పూరి జగన్నాథ్ హీరోయిన్ అనుష్క శెట్టి కాళ్లు మొక్కుతారట. (Puri Jagannadh)

Also Read: Soundarya: తెల్లారితే హీరోయిన్ పెళ్లి.. ఇంతలో సౌందర్య చావు..!

అవును మీరు వినేది నిజమే. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా పూరి జగన్నాథ్ ఓ సినిమా ఈవెంట్ లో బయటపెట్టారు.పూరి జగన్నాథ్ అనుష్కశెట్టితో చేసే ప్రతి సినిమా షూటింగ్ సమయంలో సెట్ కి రావడంతోనే అనుష్క శెట్టి కాళ్లు మొక్కుతారట. అంతే కాదు అనుష్క శెట్టిని తాము అమ్మలాగా భావిస్తామని,అందుకే షూటింగ్ కి వచ్చినప్పుడల్లా అనుష్క కాళ్లు మొక్కుతామని తెలిపారు.

Puri Jagannadh and Ravi Teja touching the feet of that star heroine

అలాగే అనుష్క లో ఉన్న గుణగణాలు కొన్ని అయినా మాకు రావాలి అనే ఉద్దేశంతో నేను అలా చేస్తానని పూరి జగన్నాథ్ చెప్పారు.అయితే కేవలం పూరి జగన్నాథ్ మాత్రమే కాదు రవితేజ, ఛార్మి కౌర్ లు కూడా అనుష్క శెట్టి కాళ్ళు మొక్కుతారట.ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ స్వయంగా బయట పెట్టారు.(Puri Jagannadh)

https://www.instagram.com/reel/DOIZYIJk1EY/?utm_source=ig_web_copy_link
Share your love