
Keerthy Suresh: ఏంటి కీర్తి సురేష్ జైలుకు వెళ్లిందా.. అంత పెద్ద హీరోయిన్ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అని చాలామందికి డౌట్ వస్తుంది. అయితే కీర్తి సురేష్ జైలుకు వెళ్లడానికి ఒక కారణం ఉందట.దాన్ని అయితే రివీల్ చేయలేదు.కానీ తాజాగా కీర్తి సురేష్ కి సంబంధించి ఓ టాక్ షో లో మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.
Keerthy Suresh went to jail
తాజాగా జగపతిబాబు హోస్ట్గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే సెలబ్రిటీ టాక్ షో కి కీర్తి సురేష్ గెస్ట్ గా వచ్చింది.గత వారం అక్కినేని నాగచైతన్య గెస్ట్ గా రాగా..ఈ వారం కీర్తి సురేష్ రాబోతోంది. అయితే తాజాగా కీర్తి సురేష్ వచ్చిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ ప్రోమోలో వచ్చి రావడంతోనే కీర్తి సురేష్ ని జగపతిబాబు నీకు బాషా లాంటి బ్యాగ్రౌండ్ ఉందట కదా.. (Keerthy Suresh)
Also Read: Rashmika: అన్నీ ఆన్లైన్ లో పెట్టాలా.. ఆ విషయంపై ఫైర్ అయిన రష్మిక.!
నిజమేనా.. జైలుకు కూడా వెళ్లి వచ్చావట అని అడగగా.. ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు అయినా నా గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు ఒక్కసారి జైలుకు కాదు చాలాసార్లు వెళ్లి వచ్చాను అంటూ మాట్లాడింది.

కానీ ఎందుకు వెళ్లిందో మాత్రం రివీల్ చేయలేదు.బహుశా ఫుల్ ఎపిసోడ్ ఈ విషయం రివీల్ అవుతుంది కావచ్చు.అయితే కీర్తి సురేష్ ప్రోమో వీడియో వైరల్ అవ్వడంతో చాలామంది జనాలు కీర్తి సురేష్ చిల్లర పనులు ఏమైనా చేసింది కావచ్చు అందుకే జైలుకు వెళ్ళింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Keerthy Suresh)




















