25 Years Of Nuvve Kavali Movie: దరిద్రం అంటే ఇదే.. ఆ హీరో చేయాల్సిన నువ్వే కావాలి చివరికి తరుణ్ తో.?

25 Years Of Nuvve Kavali Movie: కొంతమంది హీరోలకు సినిమా ఆఫర్లు తలుపు తట్టి మరీ వస్తాయి. కానీ వాళ్లు మాత్రం వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేస్తూ బ్లాక్ బస్టర్ ఛాన్స్ ని మిస్ అవుతూ

25 Years Of Nuvve Kavali Movie missed tha Hero

25 Years Of Nuvve Kavali Movie: కొంతమంది హీరోలకు సినిమా ఆఫర్లు తలుపు తట్టి మరీ వస్తాయి. కానీ వాళ్లు మాత్రం వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేస్తూ బ్లాక్ బస్టర్ ఛాన్స్ ని మిస్ అవుతూ ఉంటారు. అలా ఇప్పటికే ఇండస్ట్రీలో పేరున్న ఎంతోమంది హీరోలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను రిజెక్ట్ చేసిన వాళ్లు ఉన్నారు. అలా రిజెక్ట్ చేసి సినిమా హిట్ అయ్యాక బాధపడ్డారు. అయితే అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోలు కూడా ఉన్నారు.

25 Years Of Nuvve Kavali Movie missed tha Hero

సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకుంటున్నటువంటి నువ్వే కావాలి సినిమాలో తరుణ్ హీరోగా.. రీచా హీరోయిన్ గా.. సాయికిరణ్ సెకండ్ హీరోగా నటించారు. అయితే మొదట ఈ సినిమాలో హీరోగా తరుణ్ ని కాకుండా అక్కినేని సుమంత్ , మహేష్ బాబు ని అనుకున్నారట. కానీ ఈ హీరోలు రిజెక్ట్ చేయడంతో ఇది కాస్త తరుణ్ కి వచ్చింది. అలా మొదటి సినిమా అయినప్పటికీ తరుణ్ ఈ సినిమాలో అదరగొట్టేశారు.

25 Years Of Nuvve Kavali Movie missed tha Hero

రామోజీరావు తో సినిమా ఫిక్స్ చేసుకున్నాక హీరో కోసం వెతికే పనిలో ఉన్న సమయంలో సీనియర్ నటి రోజా రమణి ఇంటికి డైరెక్టర్ విజయ్ భాస్కర్ వెళ్లగా.. అప్పుడే బుక్స్ పట్టుకొని కాలేజీకి వెళ్తున్న రోజారమణి కొడుకు తరుణ్ ని చూసి ఈయనే మన సినిమాలో హీరో అని ఫిక్స్ అయ్యారట.(25 Years Of Nuvve Kavali Movie)

Also Read: Narne Nithiin: నార్నె నితిన్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆ హీరో చెల్లెలు అని మీకు తెలుసా.?

అలా నటీనటుల ఫిక్స్ అయిన వెంటనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి కేవలం కోటిన్నర బడ్జెట్ తోనే సినిమా పూర్తి చేశారు. అలా కోటిన్నర బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 20 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేసింది.అంతేకాదు ఈ సినిమా ఎన్నో సెంటర్లలో 50 నుండి 100 రోజుల పాటు హౌస్ ఫుల్ బోర్డులతో సక్సెస్ఫుల్ గా ఆడింది.(25 Years Of Nuvve Kavali Movie)