Sandeep Reddy Vanga సందీప్ రెడ్డి వంగాకు కౌంటర్ ఇచ్చిన అర్జున్ రెడ్డి హీరోయిన్.. “మేం మాత్రం మనుషులం కాదా” అంటూ.!

Arjun Reddy heroine counters Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా భారీ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకుంటూ కొన్ని వివాదాల్లో కూడా ఇరుక్కుంటున్నారు. రీసెంట్గా ఆయన స్పిరిట్ మూవీ నుండి దీపిక పదుకొనేని తీసివేయడంతో ఈ వివాదం చెలరేగింది. ఇదిలా కొనసాగుతున్న సమయంలో అంత గొడవ జరిగినా సైలెంట్ గా ఉన్న దీపిక సడన్గా బాంబు పేల్చింది.

Arjun Reddy heroine counters Sandeep Reddy Vanga

హీరోలు ఆరు నుంచి ఎనిమిది గంటలు పని చేస్తే వారిని ఎవరు ఏమనరు.ఇలా 6 నుంచి 8 గంటల పని చేసే హీరోలు చాలామందే ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ హీరోయిన్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తారు అన్నట్లుగా మాట్లాడింది.అలా ఈమె మాట్లాడిన మాటలు పరోక్షంగా సందీప్ రెడ్డి వంగాకి కౌంటర్ ఇచ్చినట్టు ఉన్నాయి.(Sandeep Reddy Vanga)

Also Read: 25 Years Of Nuvve Kavali Movie: దరిద్రం అంటే ఇదే.. ఆ హీరో చేయాల్సిన నువ్వే కావాలి…

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్జున్ రెడ్డి బ్యూటీ శాలిని పాండే కూడా దీపిక మాటలను సపోర్ట్ చేసింది. దీపికాకి నేను చిన్నప్పటి నుండి అభిమానిని. ఆమెకు ఏమనిపిస్తే అది నిర్భయంగా చెబుతుంది. అలాగే మేము మనుషులమే మాకు కూడా కాస్త బ్రేక్ కావాలి కదా..

Arjun Reddy heroine counters Sandeep Reddy Vanga

దీపిక డిమాండ్ చేస్తుంది కరెక్టే..ఆమె మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పులేదు.. దీపిక పదుకొనేని ప్రాజెక్ట్ నుండి తొలగించిన విషయంలో ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు.కానీ ఆమె డిమాండ్ చేసింది మాత్రం కరెక్ట్.. అంటూ సందీప్ రెడ్డి వంగా కు కౌంటర్ ఇచ్చింది.(Sandeep Reddy Vanga)

Share your love