
Dammu Sreeja: బిగ్ బాస్ సీజన్ 9 రియాల్టీ షోలోకి కామనర్ గా దమ్ము శ్రీజ వెళ్ళిన సంగతి తెలిసిందే. తన పర్ఫామెన్స్ తో అక్కడున్న వారందరినీ మెప్పించింది. కానీ సడన్ గా డబుల్ ఎలిమినేషన్ పేరుతో శ్రీజాని బయటకి పంపించేశారు. అయితే అలాంటి శ్రీజ గురించి తాజాగా ఒక వీడియో వైరల్ అవుతుంది.ఆ వీడియోలో నాగచైతన్యను వాడు వీడు అని తిడుతూ శ్రీజ మాట్లాడుతోంది.మరి ఎందుకు శ్రీజ అలాంటి మాటలు మాట్లాడింది అనేది ఎప్పుడు చూద్దాం. తాజాగా శ్రీజా కి సంబంధించి ఓ సెన్సేషనల్ వీడియో బయటపడింది. ఆ వీడియోలో శ్రీజ నాగచైతన్య సమంత ల పేర్లు వాడకుండా ఈ విధంగా చెప్పుకొచ్చింది..
Dammu Sreeja made controversial comments against Naga Chaitanya
వీరిద్దరూ టాలీవుడ్ లో బెస్ట్ సెలబ్రిటీ కపుల్.కానీ సడన్గా విడాకులు తీసుకున్నారు. ఇక విడాకులయ్యాక హీరో హీరోయిన్ ని చీట్ చేశాడని చాలామంది భావించారు. ఆ సమయంలోనే తన భర్త ఎవరితోనైతే ఎఫైర్ పెట్టుకొని తనని మోసం చేశాడని ఆ హీరోయిన్ అనుకుందో.. చివరికి అదే హీరోయిన్ ని పెళ్లి చేసుకొని మాజీ భార్యకు షాక్ ఇచ్చాడు.ఇక ఎప్పటికీ సింగిల్ గా ఉండలేరు కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే..సరిగ్గా మాజీ భార్య బర్త్డే రేపు ఉంది అనగా తన ప్రజెంట్ వైఫ్ తో పాటు గతంలో ఎక్స్ వైఫ్ కో పేరేంటింగ్ చేసిన పెట్ డాగ్ తో ఉన్న పోస్టు చేశారు. (Dammu Sreeja)
Also Read: Meesala Pilla Song: “కాత్యాయిని ని పెట్టి మీసాల పిల్ల పాట”పై ట్రోల్స్..ఒరేయ్ అఖిలూ.!
అయితే మాజీ భార్య బర్త్ డే రేపు ఉంది అనగా ఆ పోస్ట్ పెట్టడం అవసరమా.. ఇక ఆ హీరోయిన్ తన మాజీ భర్త ఈ పోస్ట్ పెట్టిన రోజే తాను ప్రొడ్యూస్ చేసిన సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది.ఆ టైంలో మాజీ భర్త ఈ పోస్ట్ పెట్టడం ఏంటి.. ఆమెను హర్ట్ చేయాలని..ఆమె జలస్ గా ఫీల్ అవ్వాలనే అలా చేస్తున్నాడు. ఇదంతా చూస్తే మాత్రం ఆయన ఎంతటి లో మెంటాలిటీ..చీప్ మెంటాలిటీని కలిగి ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు అంటూ చెప్పింది.

అయితే ఇందులో ఒక్క దగ్గర కూడా నాగచైతన్య సమంతల పేర్లు చెప్పలేదు.కానీ నాగచైతన్య శోభితతో ఉన్న ఫోటోని శుభం మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన రోజు పెట్టారు.ఇక తర్వాత రోజే సమంత బర్త్డే.అయితే ఆరోజు శ్రీజ మాట్లాడిన వీడియో ఇప్పుడు ఎక్కువ వైరల్ అవ్వడంతో చాలామంది షాక్ అవుతున్నారు.అంత పెద్ద హీరోని వాడు వీడు అని పేరు పెట్టకుండా పరోక్షంగా అంటావా అంటూ మండిపడుతున్నారు.(Dammu Sreeja)




















