Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి.. యాంకర్ షాకింగ్ కామెంట్స్.!

I have to hit myself with my own shoe for going to Bigg Boss

Bigg Boss: బిగ్గెస్ట్ రియాల్టీ షో అయినటువంటి బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఎంతో మంది కలలు కంటారు. కొంతమందికి బిగ్ బాస్ షో అదృష్టం అయితే మరి కొంత మంది దురదృష్టంగా మారుతుంది. ఎంతోమంది ముక్కు మొహం తెలియని వాళ్లకు కూడా బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు వస్తుంది. కానీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోయే వారికి మాత్రం బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక అంతా బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లి లాభపడ్డ వాళ్ళు ఉన్నారు నష్టపడ్డవాళ్ళు ఉన్నారు.

I have to hit myself with my own shoe for going to Bigg Boss

అయితే తాజాగా ఓ యాంకర్ బిగ్ బాస్ లోకి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకీ ఆ యాంకర్ ఎవరయ్యా అంటే విష్ణు ప్రియ. విష్ణు ప్రియ బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సీజన్లో విష్ణు ప్రియ, పృథ్వి తో లవ్ ట్రాక్ నడిపించింది.ఇక ఈ లవ్ ట్రాక్ తో విష్ణుప్రియ పృథ్వి ఇద్దరూ తెగ ఫేమస్ అయిపోయారు.కానీ విష్ణు ప్రియని ఇందులో కాస్త నెగిటివ్ గా కూడా చూపించారు. (Bigg Boss)

Also Read: Hero: 48 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అమ్మాయిల డ్రీమ్ బాయ్..!

ఎప్పుడు పృథ్వి చుట్టూ తిరిగే అమ్మాయి సన్నివేశాలే ఎక్కువగా చూపించారు.ఈ విషయం పక్కన పెడితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్ విష్ణు ప్రియ బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ..నేను కేవలం డబ్బు కోసం మాత్రమే బిగ్ బాస్ లోకి వెళ్ళాను. బిగ్ బాస్ లోకి వెళ్తే ఇల్లు కట్టుకోగలను. బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బుతో ఒక కొత్త ఇల్లు కట్టుకుంటాను అనే నమ్మకంతో వెళ్లాను.

I have to hit myself with my own shoe for going to Bigg Boss

కానీ బిగ్ బాస్ నుండి తిరిగి వచ్చాక కూడా నేను ఇంకా నా పాత ఇంట్లోనే ఉంటున్నాను. ఈ షో కి వెళ్ళినందుకు కొంతమంది నన్ను చాలా తిట్టారు.అసలు ఈ షో కి ఎందుకు వెళ్లానని తర్వాత చాలా బాధపడ్డాను. ఈ షోకి వెళ్లడం నేను తీసుకున్న చెత్త నిర్ణయం.ఈ షో కి వెళ్లినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది విష్ణు ప్రియ. అయితే బిగ్ బాస్ కి వెళ్లి వచ్చాక చాలామంది ఇలాంటి నెగటివ్ కామెంట్స్ చేశారు. అందులో విష్ణు ప్రియ కూడా చేరిపోయింది.(Bigg Boss)

Share your love