KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కంపెయిన్ల లిస్టులో కేసీఆర్.. ఇక కాంగ్రెస్ కు దబిడి దిబిడే

KCR: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ అకాల మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన చేయడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. KCR

KCR on Jubilee Hills by-election campaign list

గులాబీ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బరిలో దింపుతున్నారు కేసీఆర్. అటు భారతీయ జనతా పార్టీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి మూడుసార్లు ఓడిపోయిన నవీన్ యాదవ్ ఉన్నారు. అయితే ఈ సీటును ఎలాగైనా కాపాడుకోవాలని కేసీఆర్ సరికొత్త వ్యూహరచనలతో ముందుకు వెళ్తున్నారు. పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని కలుపుకొని ముందుకు దూసుకు వెళ్తున్నారు. అయితే తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కోసం గులాబీ పార్టీ తరఫున 40 మంది స్టార్ కంపెయిన్లు బరిలో దిగనున్నారు. ఈ లిస్టుకు తెలంగాణ రాసిన ప్రధాని ఎన్నికల అధికారి ఆమోదం కూడా తెలిపాడు. KCR

Also Read: Smriti Mandhana: టీమిండియా లేడీ కోహ్లీని ఏడిపించిన ఇంగ్లండ్‌

40 మంది స్టార్ కంపెయిన్లలో గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ఉన్నారు. అంటే ఆయన కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రచారం చేస్తున్నారన్నమాట. స్వ‌యంగా కేసీఆర్ బ‌రిలో దిగుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓట‌మి ఖాయ‌మ‌ని అంటున్నారు. దుబ్బాక‌లో జ‌రిగిన త‌ప్పిదం మ‌రోసారి జ‌రుగ‌కూడ‌ద‌ని, అందుకే ఈ సారి ప్ర‌చారం చేయాల‌ని కేసీఆర్ రంగంలోకి దిగుతున్నార‌ట‌. KCR

Also Read: Sugar: తియ్య‌గా ఉంద‌ని, చక్కెర ఎక్కువగా తింటున్నారా..అయితే 100 రోగాలు ఎటాక్ ?