
Tamannaah: తమన్నా పై తాజాగా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాఖీ సావంత్ చేసిన కామెంట్లు బీటౌన్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఐదు లక్షల ఇస్తే ఆ పని ఎలా చేస్తావు అంటూ రాఖీసావంత్ చేసిన కామెంట్లు తమన్నా అభిమానులకి అస్సలు నచ్చడం లేదు. మరి ఇంతకీ తమన్నా పై రాఖీసావంత్ చేసిన కామెంట్స్ ఏంటి.. ఎందుకు తమన్నా ఫ్యాన్స్ రాఖీ సావంత్ పై మండిపడుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..
Heroine vulgar comments on Tamannaah
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాఖీ సావంత్ తమన్నాని టార్గెట్ చేస్తూ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా రాఖీసావంత్ తమన్నా గురించి మాట్లాడుతూ.. తమన్నా ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ గా రాణించింది. ఆమె ఎన్నో సినిమాల్లో కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని చేసింది.అలాంటిది కేవలం ఐదు లక్షలు ఇస్తే ఐటెం సాంగ్ ఎలా చేస్తుంది? కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ ఐదు లక్షల కి ఐటమ్ సాంగ్ చేయవలసిన అవసరం ఏం వచ్చింది? ఇలా తక్కువ డబ్బులు తీసుకుని మా కడుపు కొడుతుంది.. మాకు అన్యాయం చేస్తుంది.. (Tamannaah)
Also Read: Sunil: ఆయనే నాకు లైఫ్ ఇచ్చారు.. సునీల్ ఎమోషనల్ కామెంట్స్..!
ఇలాంటి విలువల్లేని పని చేయకూడదు.. స్టార్ హీరోయిన్ గా రాణించే తమన్నా ఐదు లక్షల కోసం ఐటమ్ సాంగ్ చేయడం ఏమాత్రం బాలేదు అంటూ రాఖీ సావంత్ మండి పడింది.మరోవైపు అలా చేయడం వల్ల నాకు ఏమీ ప్రాబ్లం లేదు అని కూడా చెప్పింది. అయితే రాఖీసావంత్ మాటలపై తమన్నా అభిమానులు మండిపడుతున్నారు. మీకు ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు తమన్నా గురించి అంత వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు.

అయితే రాఖీసావంత్ తమన్నా పై మండిపడడానికి కారణం తమన్నా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని ఐటెం సాంగ్స్ చేయడం వల్ల మిగతా హీరోయిన్లకు ఆఫర్స్ రావడం లేదు. ఎందుకంటే తమన్నా తక్కువ రెమ్యూనరేషన్ కి ఐటెం సాంగ్ చేస్తే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే హీరోయిన్లను పక్కనపెట్టి తమన్నా తోనే ఐటెం సాంగ్స్ చేస్తున్నారు. అలా మిగతా హీరోయిన్లకు ఆఫర్లు ఉండడం లేదు. దీంతో రాఖీసావంత్ కోపంతో ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో తమన్నా ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ మాత్రమే చేస్తున్న సంగతి తెలిసిందే.(Tamannaah)




















