
Tamannaah: తమ అభిమాన హీరో హీరోయిన్లకు సంబంధించి ఏదైనా అన్యాయం జరిగితే చాలామంది అభిమానులు అస్సలు ఊరుకోరు.సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కడిగిపారేస్తూ ఉంటారు. అయితే తాజాగా అలాంటి అన్యాయమే తమన్నాకు జరిగింది అంటూ తమన్నా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే..మరికొద్ది గంటల్లో బాహుబలి ది ఎపిక్ మూవీ విడుదల కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. బాహుబలి 1,2 రెండు పార్ట్ లు కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రీలీజ్ అవుతుంది.
Tamannaah fans are getting hurt
ఈ మూవీ ఇప్పటికే ప్రీమియర్ షోస్ పడిపోయాయి. కొంతమంది సెలబ్రెటీస్ కూడా ఈ షోస్ ని చూసేశారు.అయితే బాహుబలి వన్, టు రెండు పార్టు లు కలిపి రీ రిలీజ్ చేశారు కాబట్టి సినిమా నిడివి ఎక్కువగానే ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ సినిమా నిడివి మిగతా సినిమాల కంటే ఎక్కువగానే ఉంది కానీ కొన్ని సీన్స్ ఇందులో లేపేసారు.ఎందుకంటే అన్ని సీన్స్ ఉంటే సినిమా 6 గంటలవుతుంది. అందుకే కొన్ని సీన్స్ లేపేసారు. (Tamannaah)
Also Read: Soundarya: సౌందర్యని చంపడానికి మర్డర్ ప్లాన్.. ఆరోపణల వెనుక అసలు నిజం.!
అందులో ముఖ్యంగా తమన్నా,ప్రభాస్ ల మధ్య ఉండే లవ్ సీన్స్ తో పాటు పచ్చబొట్టేసిన సాంగ్ తీసేసారట. అయితే పచ్చబొట్టేసిన సాంగ్ తో తమన్నా కి ఎంత మంచి గుర్తింపు వచ్చిందో చెప్పనక్కర్లేదు.ఈ సాంగ్ లో తమన్నా అందం ఓ రేంజ్ లో పాపులర్ అయింది.అలాగే తమన్నాకి సంబంధించిన కొన్ని యాక్షన్ సీన్స్ కూడా తీసేసారట. ఇందులో కీలకంగా ప్రభాస్ రానాల సీన్స్ మాత్రమే ఉంటాయని తెలుస్తోంది.దీంతో చాలామంది తమన్నా ఫ్యాన్స్ తెగ హర్ట్ అవుతున్నారు.

కూరలో కరివేపాకులా మా తమన్నా ని తీసేసారు.ఈ సినిమాలు మొదట విడుదలైన సమయంలో కూడా తమన్నాకి సంబంధించిన చాలా సీన్స్ తీసేసారు. ముఖ్యంగా బాహుబలి 2 లో తమన్నాని పూర్తిగా తీసేశారు. ఆమె యాక్షన్ సన్నివేశాలు కొన్నే ఉన్నాయి అంటూ మళ్ళీ అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మా హీరోయిన్ కి అన్యాయం చేశారు అంటూ పోస్టులు పెడుతున్నారు.(Tamannaah)





Rajamouli: మహేష్ మూవీతో రాజమౌళి పతనం ప్రారంభం.. ఆ ఒక్క మాటతో టోటల్ బ్లాస్ట్.!