Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ శ‌వాలు లేస్తాయి… గులాబీ పార్టీకి నవీన్ యాదవ్ వార్నింగ్ ?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేవలం పది రోజుల సమయం ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వచ్చే నెల 9వ తేదీ వరకు మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంటుంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహిస్తారు. 14వ తేదీన ఫలితాలు ఉంటాయి. Jubilee Hills Bypoll

Jubilee Hills Bypoll Naveen Yadav warning to the Pink Party

అయితే ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ నా అడ్డా… ఎక్కడి నుంచో వచ్చిన మీరు గల్లీ దాటి బయటకు పోలేరు అంటూ హెచ్చరికలు జారీ చేశాడు నవీన్ యాదవ్. మీ శ‌వాలు కూడా ఇంటికి పోకుండా చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే నవీన్ యాదవ్ బెదిరింపు వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. Jubilee Hills Bypoll

Also Read: Virat Kohli: కోహ్లీ రెస్టారెంట్ ధరలపై విమ‌ర్శ‌లు…ఆస్తులు అమ్ముకోవాలంటూ ఫైర్‌!

నవీన్ యాదవ్ గల్లి కూడా దాటనియ్యా అంటున్నాడు… జూబ్లీహిల్స్ నీ అయ్య జాగిరా అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికలకు ముందే ఇలా ఉంటే, ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ లో దారుణ పరిస్థితులు ఉంటాయని ఫైర్ అయ్యాడు. అందరికీ కెసిఆర్ అన్నం పెడితే… కాంగ్రెస్ పాలనలో మాత్రం గంజాయి కేసులు ఎక్కువవుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా జూబ్లీహిల్స్ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల‌ని కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. Jubilee Hills Bypoll

Also Read: Money: ఈ 3 సూత్రాలు పాటిస్తే, కోటీశ్వ‌రులు కావ‌డం ప‌క్కా..?