
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ నియోజకవర్గం హడావిడి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనుంది. నవంబర్ 14వ తేదీన రిజల్ట్ ప్రకటిస్తారు. కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి అన్ని పార్టీలు. అయితే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సర్వేలన్నీ గులాబీ పార్టీకి ఎడ్జ్ ఇస్తున్నాయి. కచ్చితంగా కెసిఆర్ పార్టీ విజయం సాధిస్తుందని చెబుతున్నాయి. Jubilee Hills Bypoll
Jubilee Hills Bypoll BRS Party merges with BJP
ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరో స్కెచ్ వేశారు. గులాబీ పార్టీకి ఓటు వేస్తే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. గులాబీ పార్టీ అలాగే బిజెపి పార్టీ ది ఫెవికాల్ బంధమంటూ బాంబు పేల్చారు. త్వరలోనే భారతీయ జనతా పార్టీలో గులాబీ పార్టీ విలీనం అవుతుందని కూడా స్కెచ్ వేశారు. అందుకే కేసిఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఈ ముగ్గురిని అరెస్టు చేసేందుకు ముందుకు రావడంలేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. Jubilee Hills Bypoll
Also Read: Jubilee Hills Survey: జూబ్లీహిల్స్ లో విజయం వారిదే..తేల్చేసిన చాణక్య సర్వే రిపోర్ట్
కాలేశ్వరం కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్టు చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని నిప్పులు జరిగారు రేవంత్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ అలాగే గులాబీ పార్టీ రెండు ఒకటేనని జనాల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే దీనికి కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు. నిజంగా మగాడివైతే కాలేశ్వరం అలాగే ఈ ఫార్ములా కేసులో చర్చకు రా అంటూ సవాల్ విసిరారు. Jubilee Hills Bypoll
Also Read: Telangana Cabinet: జూబ్లీహిల్స్ ఎన్నికల తరువాత తెలంగాణ కేబినెట్ నుండి ముగ్గురు మంత్రులు ఔట్…





