
Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. 14వ తేదీన ఫలితాలు బయటకు వస్తాయి. ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలో రెండు కూడా ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. గులాబీ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బిజెపి పార్టీ అభ్యర్థి ఇంకా ఫైనల్ కాలేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి పై సంచలన ఆరోపణలు చేశారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్పకుంట్ల తారక రామారావు. Jubilee Hills Bypoll
Jubilee Hills Bypoll Congress candidate Naveen Yadav’s younger brother gets 3 stolen votes
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ తమ్ముడు ప్రవీణ్ యాదవ్‌కు 3 ఫేక్ ఓట్లు ఉన్నట్లు ఆధారాలతో నిరూపించారు కేటీఆర్. కాంగ్రెస్ అభ్యర్థి సొంత సోదరుడికే 3 దొంగ ఓట్లు ఉంటే ఇదేం ఎన్నిక అంటూ ఆగ్రహించారు. మేము న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము.. మాకు ఎన్నికల కమిషన్ మీద నమ్మకంలేదు ఎందుకంటే వాళ్ళు బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే సంస్థ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. మరి ఇంక గత్యంతరం లేదంటే కోర్టుకు వెళ్లి అక్కడ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాము.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్పందించాలని రిక్వెస్ట్ చేశారు. Jubilee Hills Bypoll
Also Read: Rave Party: హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం… 14 మంది మహిళలతో చిల్
ఎన్నికలు 10 రోజులు ఆలస్యమైనా సరే దొంగ ఓట్లు తొలగించి న్యాయంగా ఎన్నికలు జరిపించండని కోరారు. దీనికి కారణమైన అధికారి మీద చర్యలు తీసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. ఓటర్ల అనుమతి లేకుండా వివిధ జిల్లాల నుండి దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. గోగూరి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి సిరిసిల్లలో ఓటు ఉంది, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఓటు వచ్చిందని ఫైర్ అయ్యారు. దీనిపై శ్రీనివాస్ రెడ్డిని కలిస్తే నా ఓటు జూబ్లీహిల్స్ లో ఎలా వచ్చిందని షాక్ అయ్యా, నేను పుట్టింది, పెరిగింది ఇప్పుడు ఉండేది అంతా సిరిసిల్లలోనే అని అన్నాడని పేర్కొన్నారు కేటీఆర్. Jubilee Hills Bypoll
Also Read: Lemon: రోజుకు ఒక్క నిమ్మకాయ తింటే… 100 రోగాలను తరిమికొట్టండి ?





