
Snake gourd: పొట్లకాయ ఇది చూడడానికి ఎవరికీ పెద్దగా నచ్చదు. పాములాగా ఉంటుందని చాలా మంది పొట్లకాయను తినడానికి అసలు ఇష్టపడరు. అయితే పొట్లకాయలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా అతి భయంకరమైన వ్యాధి క్యాన్సర్ రాకుండా కాపాడే శక్తి పొట్లకాయకు ఉంటుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా పొట్లకాయ సహాయం చేస్తుంది. పొట్లకాయలను తరచుగా తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. కీళ్ల నొప్పులు, వాపుల సమస్యలతో బాధపడేవారు పొట్లకాయను ప్రతి రోజు తిన్నట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నవారికి తక్షణ ఉపశమనం లభిస్తుంది. Snake gourd
Snake gourd provides numerous health benefits
జ్వరం, కామెర్లు లాంటి సమస్యలతో బాధపడేవారు పొట్లకాయను తిన్నట్లయితే త్వరగా వ్యాధులు నయం అవుతాయి. గుండె జబ్బులు ఉన్నవారికి కూడా పొట్లకాయ ఎంతో మంచిది. గుండె సంబంధ సమస్యలతో బాధపడేవారు పొట్లకాయను తినాలి. పొట్లకాయలో కాల్షియం అధికంగా ఉంటుంది. దీని వల్ల ఎముకలు బలంగా, దృఢంగా తయారు అవుతాయి. పొట్లకాయలో న్యూట్రియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి జ్వరం వచ్చిన సమయంలో తిన్నట్లయితే తక్షణమే జ్వరం తగ్గుతుంది. పొట్లకాయ మాత్రమే కాకుండా పొట్లకాయ ఆకులను శరీరం పైన పేస్ట్ చేసుకొని రాసినట్లయితే జ్వరం, శరీరంలో ఉన్న వేడి తొలగిపోతుంది. పొట్లకాయను తినడం వల్ల నీరసం, అలసట లాంటి సమస్యలు తొలగిపోతాయి. పొట్లకాయలో అనేక రకాల సమ్మేళనాలు ఉంటాయి. పొట్లకాయలో ప్రోటీన్లు, విటమిన్లు ఉండడం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. కాలేయ సంబంధ సమస్యలతో పొట్లకాయను తిన్నట్లయితే చాలా మంచిది. Snake gourd
Also Read: Money: ఈ 3 సూత్రాలు పాటిస్తే, కోటీశ్వరులు కావడం పక్కా..?
చాతి నొప్పి, చాతిలో మంట, గుండెలో నొప్పి లాంటి సమస్యలతో బాధపడేవారు వారంలో రెండు మూడు సార్లు పొట్లకాయలు తిన్నట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. పొట్లకాయ తినడానికి ఇష్టపడని వారు పొట్లకాయను జ్యూస్ చేసుకుని ప్రతిరోజు ఉదయం పూట ఒక గ్లాసడు తాగినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పొట్లకాయ తినడం వల్ల బరువు తగ్గడంలో కూడా ఎంతగానో సహాయం చేస్తుంది. ప్రతిరోజు ఒక గ్లాసుడు పొట్లకాయ జ్యూస్ తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు వేగంగా కరుగుతుంది. దానివల్ల సన్నగా తయారు అవుతారు. పొట్లకాయ పేస్ట్ తో హెయిర్ ప్యాక్ వేసుకున్నట్లయితే జుట్టుకు చాలా మంచిది. జుట్టు ఊడడం రాలడం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. పొట్లకాయ పేస్ట్ ను తలకు పట్టించడం వల్ల చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. దీంతో జుట్టు, బలంగా ఒత్తుగా తయారు అవుతుంది. పొట్లకాయ తిన్నట్లయితే నిద్ర కూడా చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు పొట్లకాయలు తిన్నట్లయితే చాలా మంచిది. Snake gourd
Also Read: Virat Kohli: కోహ్లీ రెస్టారెంట్ ధరలపై విమర్శలు…ఆస్తులు అమ్ముకోవాలంటూ ఫైర్!




















